Home /News /national /

PM NARENDRA MODI TO BEGIN HOLDING MEETINGS WITH MINISTERS FROM TODAY AND MAY RESHUFFLE CABINET SK

Union Cabinet: కేంద్రంలో కొత్త మంత్రులు.. త్వరలో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ..?

ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ

Cabinet Reshuffle: ప్రధాని నరేంద్ర మోదీ త్వరలోనే కేంద్రమంత్రులతో అసెస్‌మెంట్ మీటింగ్స్ నిర్వహించనున్నట్లు సమాచారం. శాఖల వారీగా భేటీలను నిర్వహిస్తారని తెలుస్తోంది. ఆ సమావేశాల్లోనే మంత్రుల పనితీరుపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించనున్నారట. పనితీరు బాగా లేని మంత్రులను కేబినెట్ నుంచి తప్పించి.. వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఉంది.

ఇంకా చదవండి ...
    ప్రస్తుతం మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతోంది.  కరోనా 2.0 నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. కొత్త కేసులు తగ్గడంతో పాటు రికవరీలు భారీగా పెరిగాయి.  మొన్నటి వరకు కోవిడ్ మహమ్మారితో పాటు పలు అంశాలకు సంబంధించిన కార్యక్రమాలతో ప్రధాని మోదీ (PM Narendra Modi) బిజీ బిజీగా ఉన్నారు. ఐతే కరోనా పరిస్థితులు కొంత కుదుటపడడంతో ఇప్పుడు కేబినెట్‌పై దృష్టిసారించినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ (Cabinet Reshuffle) ఉంటుందున్న ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. కొందరి శాఖలు మారవచ్చని.. ఇంకొందరికి కేబినెట్‌ నుంచి ఉద్వాసన పలకవచ్చని ప్రచారం జరుగుతోంది. కొత్తవారికి కూడా అవకాశం ఇస్తారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ ఉంటుందని, కేంద్ర ప్రభుత్వంలోని విశ్వసనీయ వర్గాలు చెప్పినట్లుగా 'టైమ్స్ నౌ' వార్తలను ప్రసారం చేసింది. ఈ కథనాల ప్రకారం.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్ని మంత్రిత్వశాఖల నుంచి వివరాలను సేకరించనున్నారు. మంత్రుల పనితీరు.. ఆయా రంగాలు సాధించిన అభివృధ్ధిని సమీక్షించనున్నారు. అనంతరం కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ చేపట్టవచ్చని తెలుస్తోంది.

    ప్రధాని నరేంద్ర మోదీ త్వరలోనే కేంద్రమంత్రులతో అసెస్‌మెంట్ మీటింగ్స్ నిర్వహించనున్నట్లు సమాచారం. శాఖల వారీగా భేటీలను నిర్వహిస్తారని తెలుస్తోంది. ఆ సమావేశాల్లోనే మంత్రుల పనితీరుపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించనున్నారట. అనంతరం పనితీరు బాగా లేని మంత్రులను కేబినెట్ నుంచి తప్పించి.. వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఐదు కారణాలతో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ‌ చేయాలని మోదీ భావిస్తున్నాట. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో పరిపాలన విభాగంపై దృష్టిపెట్టేందుకు సమయం దొరికింది. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలను ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాల్సి ఉంది. ఇక విపక్షాలను విమర్శలను తిప్పికొట్టే సమర్ధవంతమైన నేతలను అవసరం ఉంది. కోవిడ్ దెబ్బకు కకావికలమైన పలు రంగాల్లో పునరుత్తేజం నింపాలని కేంద్రం భావిస్తోంది. అంతేకాదు 2019లో రెండోసారి మోదీ ప్రభుత్వం ఏర్పటైన తర్వాత.. ఇప్పటి వరకు మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ జరగలేదు. ఈ నేపథ్యంలో మంత్రివర్గంలో మార్పులు చేర్పులకు.. ఇదే సరైన సమయమని ప్రధాని మోదీ యోచిస్తున్నారట.

    మరోవైపు వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అందుకోసం ఇప్పటి నుంచి వ్యూహాలను రచిస్తోందని కమలదళం. యూపీలో కేబినెట్‌ను ప్రక్షాళన చేయడంతో పాటు రాజకీయంగానూ కీలక మార్పులు చేయాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. సీఎంను మార్చనున్నారన్న ఊహాగానాలూ వినిపించాయి. యూపీలో సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్‌పార్టీ ఒక్కటైన నేపథ్యంలో.. వారిని ఎదుర్కోవాలంటే తమకు బలమైన మిత్రపక్షం కావాలని యోచిస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్త మిత్రపక్షంపై బీజేపీ దృష్టిపెట్టింది. అంతేకాదు ఇతర పార్టీ నుంచి వలసలను కూడా ప్రోత్సహిస్తున్నారు. ఇటీవలే కాంగ్రెస్ సీనియర్ నేత జితిన్ ప్రసాద ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరారు. ఈ పరిణామాల నేపథ్యంలో శుక్రవారం ప్రధాని మోదీతో యోగి ఆదిత్యనాథ్ సమావేశం కానున్నారు. అసెంబ్లీ ఎన్నిలకకు ఎలా సన్నద్ధమవ్వాలన్న వ్యూహంతో పాటు తాజా రాజాకీయాల గురించి చర్చించనున్నారు. ఇదే సమయంలో కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ గురించి ఊహాగానాలు వినిపించడం చర్చనీయాంశంగా మారింది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Cabinet Reshuffle, Narendra modi, PM Narendra Modi, Union cabinet

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు