హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

PM Narendra Modi: దేశ సేవలో ఇదే స్పూర్తి కొనసాగాలి.. ప్రధాని మోదీ ఆకాంక్ష

PM Narendra Modi: దేశ సేవలో ఇదే స్పూర్తి కొనసాగాలి.. ప్రధాని మోదీ ఆకాంక్ష

ఫ్రధాని నరేంద్రమోదీ (ఫైల్ ఫోటో)

ఫ్రధాని నరేంద్రమోదీ (ఫైల్ ఫోటో)

PM Narendar Modi: ఈ రోజు నుంచి సేవా ఔర్ సమర్పణ్ అభియాన్‌ కార్యక్రమంలో పాలుపంచుకున్న బీజేపీ కార్యకర్తలను ప్రధాని నరేంద్రమోదీ అభినందించారు.

తనకు పుట్టిన శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ప్రధాని నరేంద్రమోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మరికొన్ని విషయాలను ప్రస్తావించారు. ఈ రోజు వ్యాక్సినేషన్ సంఖ్య ప్రతి ఒక్క భారతీయుడు గర్వపడేలా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను విజయవంతం చేసిన డాక్టర్లు, నర్సులు, ఇతర ఆరోగ్య కార్యకర్తల సేవలను కొనియాడారు. ఇదే స్పూర్తితో వ్యాక్సినేషన్‌ను కొనసాగించి కరోనాను ఓడించాలని కోరారు. ఇదే సమయంలో ఈ రోజు నుంచి సేవా ఔర్ సమర్పణ్ అభియాన్‌ కార్యక్రమంలో పాలుపంచుకున్న బీజేపీ కార్యకర్తలను ప్రధాని నరేంద్రమోదీ అభినందించారు. ప్రజల జీవితాలను మెరుగుపరుచడానికి వారి తీసుకుంటున్న చొరవను చూసి తాను గర్వపడుతున్నానని అన్నారు. మన ప్రయాణం కొనసాగుతుందని ఆయన కార్యకర్తలకు సూచించారు. ఇంకా ఎంతో చేయాల్సి ఉందని అన్నారు.

బలమైన దేశాన్ని సాధించేవరకు విశ్రమించరాదని ప్రధాని మోదీ తెలిపారు. అందరి శుభాకాంక్షలు తాను దేశం కోసం మరింతగా శ్రమించేందుకు దోహదం చేస్తాయని ప్రధాని మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు. భారతదేశమంతటా ఈ ఒక్కరోజే 2కోట్ల మందికి పైగా వ్యాక్సినేషన్ వేశారు. ఒక్కరోజులో అత్యధికంగా డోసులు వేసి రికార్డు నమోదు చేశారు. ప్రధాని నరేంద్రమోదీ పుట్టినరోజే ఈ రికార్డ్ నెలకొనడం విశేషం.

ప్రధాని మోదీకి 71వ పుట్టినరోజు సందర్భంగా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. 71 ఎర్ర గులాబీల పుష్పగుచ్ఛాన్ని ఇచ్చారు. అంతేకాకుండా హిందోలో ప్రత్యేకమైన సందేశం కూడా పంపించారు.ప్రధాని మోదీకి తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. అంతకుముందు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. వివిధ దేశాల నేతల నుంచి కూడా ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

First published:

Tags: Bjp, PM Narendra Modi

ఉత్తమ కథలు