Home /News /national /

PM NARENDRA MODI TELANGANA TOUR SCHEDULE CONFIRMED HEAVY SECURITY NEAR HICC AND OTHER LOCATIONS AK

PM Modi Telangana Tour: ప్రధాని మోదీ తెలంగాణ టూర్ షెడ్యూల్ ఖరారు.. ఏ సమయంలో ఎక్కడ ఉంటారంటే..

హైదరాబాద్, ప్రధాని మోదీ (ఫైల్ ఫోటో)

హైదరాబాద్, ప్రధాని మోదీ (ఫైల్ ఫోటో)

PM Modi in Hyderabad: హెచ్‌ఐసీసీకి 5 కిలోమీటర్ల పరిధిలో 144 సెక్షన్, నో ఫ్లై జోన్‌గా ప్రకటించారు. 4 రోజుల పాటు పూర్తిగా పోలీసుల నిఘాలో హెచ్‌ఐసీసీ ఉండనుంది. కేవలం బీజేపీ అనుమతించిన ప్రతినిధులకే హెచ్ఐసీసీలోకి అనుమతించనున్నారు.

  తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలతో పాటు భారీ బహిరంగ సభలో పాల్గొనేందుకు రానున్న ప్రధాని నరేంద్రమోదీకి టూర్ షెడ్యూల్ ఖరారైంది. ప్రధాని మోదీ(PM Modi) పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు చేస్తున్నారు. హెచ్‌ఐసీసీ (HICC)పరిసరాల్లో 3 వేల మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు. హెచ్‌ఐసీసీకి 5 కిలోమీటర్ల పరిధిలో 144 సెక్షన్, నో ఫ్లై జోన్‌గా ప్రకటించారు. 4 రోజుల పాటు పూర్తిగా పోలీసుల నిఘాలో హెచ్‌ఐసీసీ ఉండనుంది. కేవలం బీజేపీ(BJP) అనుమతించిన ప్రతినిధులకే హెచ్ఐసీసీలోకి అనుమతించనున్నారు. కేవలం అనుమతించిన ప్రాంతంలోనే వాహనాలు నిలపాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇక తెలంగాణలో(Telangana) ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్ ఇలా ఉంది.

  జులై 2న
  మధ్యాహ్నం 2.55 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు ప్రధాని మోదీ
  ప్రత్యేక హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 3.20 గంటలకు హెచ్‌ఐసీసీకి చేరుకోనున్న ప్రధాని
  సాయంతం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొననున్న నరేంద్రమోదీ

  జులై 3న
  ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు సమావేశాల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ
  సాయంత్రం 6.15 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న మోదీ
  సాయంత్రం 6.30 గంటలకు రోడ్డు మార్గంలో పరేడ్ గ్రౌండ్స్‌ సభకు ప్రధాని
  సాయంత్రం 6.30 నుంచి 7.30 వరకు సభలో ఉండనున్న మోదీ
  రాత్రి నోవాటెల్ లేదా రాజ్‌భవన్‌లో బస

  జులై 4న
  4వ తేదీ ఉదయం 9.20 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు మోదీ
  ప్రత్యేక విమానంలో విజయవాడకు వెళ్లనున్న ప్రధానమంత్రి

  Maharashtra| BJP: మహారాష్ట్రలో మరోసారి టార్గెట్ ఉద్ధవ్ థాక్రే.. బీజేపీ సరికొత్త ప్లాన్.. అందుకే చివరి నిమిషంలో..

  GST Council: హాస్పిటల్ రూమ్స్‌కి కూడా ఇక జీఎస్టీ.. బెట్టింగ్‌లపై మాత్రం పెండింగ్.. కౌన్సిల్ నిర్ణయాలు ఇవే..!

  మరోవైపు బీజేపీ సమావేశాలకు సారథ్యం వహించనున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా 1న ఉదయం హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి సమావేశాలు జరిగే నోవాటెల్‌ వరకు భారీ ర్యాలీతో నడ్డాకు స్వాగతం పలకాలని రాష్ట్ర బీజేపీ నేతలు నిర్ణయించారు.అదే రోజున సాయంత్రం నడ్డా అధ్యక్షతన జరిగే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శుల భేటీలో.. కార్యవర్గ సమావేశాల ఎజెండా, చేయాల్సిన తీర్మానాలపై నిర్ణయాలు తీసుకుంటారు. 2న ఉదయం పదాధికారుల సమావేశం, సాయంత్రం 4 గంటల నుంచి 3వ తేదీ సాయంత్రం 5 దాకా జాతీయ కార్యవర్గ సమావేశాలు ఉంటాయి. 3న సాయంత్రం పరేడ్‌గ్రౌండ్స్‌లో ప్రధాని మోదీ బహిరంగసభ ఉంటుంది. తుది సన్నాహాలపై సమీక్షించేందుకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్‌చార్జి తరుణ్‌ చుగ్, ఇతర నేతలు శనివారం హైదరాబాద్‌కు రానున్నారు.
  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Bjp, Hyderabad, Narendra modi, Telangana

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు