PM Narendra Modi: కరోనా సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నోసార్లు జాతినుద్దేశించి ప్రసంగించారు. మళ్లీ చాలా రోజుల తర్వాత ఇవాళ మాట్లాడబోతున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రసంగంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) కాసేపట్లో జాతినుద్దేశించి ప్రసంగించబోతున్నారు. ఉదయం 10 గంటలకు ప్రధాని మోదీ ప్రసంగం ఉంటుందని ప్రధాని కార్యాలయం (PMO) ప్రకటించింది. కరోనా సమయంలో ఆయన ఎన్నోసార్లు జాతినుద్దేశించి ప్రసంగించారు. మళ్లీ చాలా రోజుల తర్వాత ఇవాళ మాట్లాడబోతున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రసంగంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇవాళ మోదీ ఏం మాట్లాడతారు? దేని గురించి ప్రసంగిస్తారు? ఏదైనా కీలకల ప్రకటన చేస్తారా? అని అందరూ ఎదురు చూస్తున్నారు.
PM Narendra Modi will address the nation at 10 AM today: PMO
ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తారని ప్రధాని కార్యాలయం ట్వీట్ చేయగానే నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. సార్.. పెట్రోల్ ధరలు, రైతుల ఆందోళనలు, లఖీంపూర్ ఘటనపై స్పందించాలని చాలా మంది కోరుతున్నారు. ఐతే వాటి గురించి ప్రధాని మోదీ అస్సలు నోరు తెరవని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొందరైతే పెట్రోల్ ధరల గురించి మాట్లాడవచ్చని అంచనా వేస్తున్నారు. దీపావళి సందర్భంగా దేశ ప్రజలకు కేంద్రం గుడ్‌న్యూస్ చెబుతుందని.. పెట్రోల్, డీజిల్‌పై పన్నులను తగ్గించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. పెట్రోల్ రేటను రూ.100కు దిగువన తీసుకొచ్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పెట్రోల్ రేట్ల గురించి ప్రధాని మోదీ శుభవార్త చెప్పబోతున్నారా? అనే చర్చ కూడా జరుగుతోంది.
ఐతే ఇదంతా కాదు.. భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్ 100 కోట్ల డోసుల మైలురాయిని అధిగమించిన సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించబోతున్నారని చాలా మంది భావిస్తున్నారు. గురువారం మన దేశం చరిత్ర సృష్టించింది. కరోనా వ్యాక్సినేషన్లో 100 కోట్ల డోసులు దాటింది. చైనా తర్వాత ఆ ఘనత సాధించిన రెండో దేశంగా ఇండియా నిలిచింది. ఈ నేపథ్యంలో కోవిడ్ 100 కోట్ల డోస్‌ల రికార్డును వేడుకలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ విజయానికి కారణమైన శాస్త్రవేత్తలు, వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలతో పాటు కరోనా పోరాటంలో ముందు వరుసలో ఉన్న డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులకు ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగం ద్వారా మరోసారి ధన్యవాదాలు చెప్పనున్నారని సమాచారం.
మన దేశంలో జనవరి 16న కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభమయింది. అప్పటి నుంచి నిరంతరాయంగా కొనసాగుతోంది. మొదటి దశలో కరోనా పోరులో ముందున్న వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులకు టీకాలు ఇచ్చారు. ఆ తర్వాత ఏప్రిల్ 1 నుంచి రెండో దశ ప్రారంభమయింది. రెండో దశలో 45 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సినేషన్ వేయడం ప్రారంభించారు. అనంతరం మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన పౌరులందరికీ టీకాలు వేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబరు 17న ఏకంగా 2.50 కోట్ల డోసుల వ్యాక్సిన్ వేసి రికార్డు సృష్టించారు. మొత్తంగా 9 నెలల్లోనే 100 కోట్ల డోస్‌ల మార్క్‌ను దాటేసింది భారత్.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.