ఎర్రకోట నుంచి ఏం మాట్లాడాలో చెప్పండి... ప్రధాని మోదీ ట్వీట్

నరేంద్ర మోదీ (File)

PM Narendra Modi | దేశ ప్రధానిగా నరేంద్రమోదీ రెండోసారి బాధ్యతలు స్వీకరించిన తరువాత జరగనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆయన ఎలాంటి అంశాలను తన ప్రసంగంలో ప్రస్తావిస్తారనే అంశంపై దేశ ప్రజలందరిలోనూ ఆసక్తి నెలకొంది.

  • Share this:
    స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తన ప్రసంగంలో ఏయే అంశాలు ఉంటే బాగుంటుందనే అంశంపై ప్రజల నుంచి సలహాలు తీసుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ నిర్ణయించారు. ఈ మేరకు తనకు సలహాలు ఇవ్వాలని ప్రజలకు ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. నమో యాప్‌లోని ఓపెన్ ఫామ్ ద్వారా ప్రజల ఆలోచనలు, సలహాలు ఇవ్వాలని ఆయన సూచించారు. మీ ఆలోచనలు, సలహాల కోసం ఎదురుచూస్తున్నానని ట్వీట్ ద్వారా తెలియజేశారు. ప్రధాని ట్వీట్ చేసిన వెంటనే అనేక మంది నమో యాప్ ద్వారా తమ సలహాలు, ఆలోచనలు పంపడం మొదలుపెట్టారు.
    ప్రధాని నరేంద్రమోదీ ఈ రకంగా ప్రజల నుంచి సలహాలు తీసుకోవడం కొత్తేమీ కాదు. గతంలోనూ ఆయన ఈ రకమైన పద్ధతిని అనుసరించి... వారిచ్చిన సూచనలను తన ప్రసంగంలో పొందుపరిచారు. ప్రధాని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మన్ ‌కీ బాత్ కార్యక్రమంలోని అంశాలపై కూడా ఆయన ప్రజల సలహాలు, సమస్యలు స్వీకరిస్తున్నారు. దేశ ప్రధానిగా నరేంద్రమోదీ రెండోసారి బాధ్యతలు స్వీకరించిన తరువాత జరగనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆయన ఎలాంటి అంశాలను తన ప్రసంగంలో ప్రస్తావిస్తారనే అంశంపై దేశ ప్రజలందరిలోనూ ఆసక్తి నెలకొంది.
    First published: