PM NARENDRA MODI SAYS RAISING THE AGE OF MARRIAGE FOR WOMEN SOME ARE SUFFERING EVK
PM Narendra Modi: మహిళల వివాహ వయసు పెంచితే.. కొందరికి బాధ కలుగుతోంది: ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ
Marriage Age 21 | ప్రయాగ్రాజ్లో జరిగిన ర్యాలీలో ప్రసంగించిన ప్రధాని మోదీ విపక్షల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల వివాహ వయస్సును 21కి పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మహిళలు సంతోషంగా ఉన్నారని, అయితే ఇది కొందరికి బాధ కలిగించిందని అన్నారు.
ప్రతిపక్షాలపై విమర్శలు చేయడంలో ప్రధాని మోదీది ప్రత్యేక శైలీ. ప్రస్తుతం ఆయన ఉత్తర్ ప్రదేశ్లో పర్యటిస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh)లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. త్వరలో ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ (PM Modi) పలు ర్యాలీలు, సభలు నిర్వహిస్తున్నారు. తాజాగా ప్రయాగ్రాజ్లో జరిగిన ర్యాలీలో ప్రసంగించిన ప్రధాని మోదీ విపక్షల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల వివాహ వయస్సును 21కి పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మహిళలు సంతోషంగా ఉన్నారని, అయితే ఇది కొందరికి బాధ కలిగించిందని అన్నారు. “మహిళల వివాహ వయస్సును 21 సంవత్సరాలకు పెంచడానికి మేము ప్రయత్నిస్తున్నాము, తద్వారా వారు చదువుకోవడానికి, పురోగతికి సమయం ఉంటుంది. దేశం తన కుమార్తెల కోసం ఈ నిర్ణయం తీసుకుంటోంది. దీని వల్ల ఎవరికి ఇబ్బందులు ఎదురవుతున్నాయో అందరూ చూస్తున్నారు.. కొందరికి ఇది బాధ కలిగించింది,” అని అన్నారు.
ఉత్తర్ ప్రదేశ్లో ఒకప్పుడు గుండాల రాజ్యం ఉండేదని.. యోగీ ముఖ్యమంత్రి అయ్యాక గుండాలకు బుద్ధి చెప్పారని అన్నారు. తాజాగా బీజేపీ ప్రభుత్వం రెండు ప్రధానమైన బిల్లులను ప్రవేశ పెట్టారు. ‘ఓటరు ఐడీకి ఆధార్ అనుసంధానం’ చేసే ఎన్నికల చట్టం సవరణ బిల్లు, ‘అమ్మాయిల పెళ్లి వయసు పెంపు’ బిల్లు ఈ రెండు బిల్లులపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
అయితే పార్లమెంట్ శీతాకాల సమావేశాల ముగింపు తేదీ ఈనెల 23 అయినా, ప్రస్తుతం రెండు సభల్లో నెలకొన్న గందరగోళ పరిస్థితుల దృష్ట్యా సభ ఏ క్షణంలోనైనా నిరవధిక వాయిదా పడే అవకాశాలుండటంతో మోదీ సర్కార్ స్పీడు పెంచింది. ఈ శీతాకాల సమావేశాల్లో కీలకమైన బిల్లుల్ని ఆమోదింపజేసుకొని, మంగళవారం నాడే రాజ్యసభలో ప్రవేశపెట్టింది. అమ్మాయిల పెళ్లి వయసును 21ఏళ్లకు పెంచడాన్ని తప్పుపడుతూ విపక్ష ఎంపీలు నిరసనలు చేస్తుండగా, ఆ గందరగోళంలోనే ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టారు.
NEET Counselling: నీట్ కౌన్సెలింగ్పై MCC కీలక ప్రకటన.. మొత్తం నాలుగు రౌండ్ల ద్వారా మెడికల్ సీట్ల భర్తీ
కోటి విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లు..
త్వరలో ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh) ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో యోగీ ప్రభుత్వం తాజాగా కొత్త నిర్ణయం తీసుకొంది. రాష్ట్రంలో ఫైనల్ ఇయర్ చదవుతున్న కోటి మంది విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు (Smart Phones), ట్యాబ్లు అందించనున్నట్టు ప్రకటించింది. డిసెంబర్ 25, 2021న మాజీ ప్రధాని, భారత రత్న వాజ్పేయి జయంతి రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆరోజు లక్షమందికి స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లు అందించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరు అయ్యేలా ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.