Home /News /national /

PM NARENDRA MODI SAYS PEOPLE OF INDIA CONFIDENCE ON BJP INCREASED REVEALED IN UTTAR PRADESH AND OTHER STATE ELECTIONS AK

PM Modi Speech: హిమాలయాల నుంచి గోవా వరకు బీజేపీకి మద్దతు.. పేదలకు అండగా ఉంటామన్న ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్రమోదీ

ప్రధాని నరేంద్రమోదీ

PM Modi: పేదలకు అందాల్సినవన్నీ హక్కుగా లభిస్తున్నాయని.. వారికి దక్కాల్సినవన్నీ దక్కేవారికి తాను విశ్రమించనని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు.

    హిమాలయాల నుంచి గోవా వరకు బీజేపీకి మద్దతు లభించిందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. యూపీ, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్‌లో బీజేపీకి ఆదరణ పెరిగిందని అన్నారు. తమపై నమ్మకం ఉంచిన మాతృమూర్తులకు, సోదరీమణులకు ధన్యవాదాలు తెలిపారు. యూపీలో మొదటిసారి బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిందని.. గోవా ప్రజలు మాకు మూడోసారి అవకాశం ఇచ్చారని ప్రధాని మోదీ తెలిపారు. ఉత్తరాఖండ్‌లో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చామని అన్నారు. గ్యాస్, విద్యుత్, నీరు, టెలిఫోన్ సౌకర్యాలు ప్రజంలదరికీ వచ్చాయని చెప్పారు. పేదలకు అందాల్సినవన్నీ హక్కుగా లభిస్తున్నాయని.. వారికి దక్కాల్సినవన్నీ దక్కేవారికి తాను విశ్రమించనని అన్నారు. బీజేపీ సుపరిపాలన వల్లే ఈ విజయం సాధ్యమైందని ప్రధాని మోదీ అన్నారు. బీజేపీ విజయంలో మహిళలు, యువతది కీలక పాత్ర అని కొనియాడారు.

    తొలిసారి ఓటేసిన యువత బీజేపీకే అండగా నిలిచారని అన్నారు. 2019లో కేంద్రంలో తాము రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు 2017లో యూపీలో విజయం కారణంగా ఇది సాధ్యమైందని కొందరు రాజకీయ నిపుణులు చెప్పారని ప్రధాని మోదీ అన్నారు. 2022 ఎన్నికల ఫలితాలు 2024 జాతీయ ఎన్నికల భవితవ్యాన్ని నిర్ణయిస్తాయని ఆ నిపుణులు చెబుతారని తాను నమ్ముతున్నానని వ్యాఖ్యానించారు. గోవాలో అన్ని ఎగ్జిట్ పోల్స్ తప్పని రుజువైందని ప్రధాని మోదీ గుర్తు చేశారు.

    ఉత్తరాఖండ్‌లో బీజేపీ కొత్త చరిత్రను లిఖించిందని చెప్పారు. రాష్ట్రంలో తొలిసారిగా వరుసగా రెండోసారి ఓ పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. దేశాభివృద్ధిలో సామాన్యులు పాలుపంచుకుంటున్నారు కానీ కొందరు మాత్రం రాజకీయాల స్థాయిని దిగజార్చుతున్నారని ప్రధాని మోదీ విమర్శించారు. దేశంలో వారసత్వ రాజకీయాలు అంతం కావాల్సిన అవసరం ఉందన్న ప్రధాని మోదీ.. ఏదో ఒక రోజు అది తప్పకుండా జరుగుతుందని వ్యాఖ్యానించారు.

    CM Yogi: యోగి ప్రభంజనం.. గోరఖ్‌పూర్‌లో 1లక్షకుపైగా మెజార్టీతో విజయం.. Lakhimpurలో బీజేపీ క్లీన్ స్వీప్

    Assembly Elections Results: యూపీ సహా 4 రాష్ట్రాల్లో మళ్లీ బీజేపీదే అధికారం..పంజాబ్‌లో ఆప్ సంచలనం

    దేశంలోని కరోనా టీకా కార్యక్రమాన్ని ప్రపంచం మెచ్చుకుంది కానీ కొందరు తమ టీకాలను ప్రశ్నించారని ధ్వజమెత్తారు. ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధం గురించి మాట్లాడిన మోదీ.. ఈ యుద్ధం ఃప్రతి దేశాన్ని ప్రభావితం చేస్తోందని, భారత్ శాంతి, చర్చలకు మద్దతిస్తోందని తెలిపారు. యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధర పెరుగుతోందని, వివిధ దేశాల నుంచి చమురు దిగుమతి చేసుకోవాల్సి రావడంతో భారత్‌పై ప్రభావం పడిందని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Pm modi, Uttar pradesh

    తదుపరి వార్తలు