Home /News /national /

PM NARENDRA MODI SAYS INDIA IS BECOMING DEFENCE EXPORTER IN NAVAL SEMINAR HELD IN NEW DELHI AK

PM Modi: రక్షణ రంగంలో ఎగుమతిదారుగా ఎదుగుతున్నాం.. అలాంటి దాడి జరుగుతోందన్న ప్రధాని మోదీ

ప్రధాని మోదీ (Image: ANI)

ప్రధాని మోదీ (Image: ANI)

PM Modi: ఒకప్పుడు రక్షణ పరికరాల అంశంలో ప్రధాన సరఫరాదారుగా ఉన్నామని.. కానీ తరువాత రక్షణ రంగంలో అతిపెద్ద దిగుమతిదారుగా మారామని ప్రధాని మోదీ అన్నారు.

    భారతదేశంలో కొత్త రక్షణ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గత ఎనిమిదేళ్లలో తమ ప్రభుత్వం రక్షణ బడ్జెట్‌ను పెంచిందని.. భారతదేశంలో రక్షణ తయారీ (Defence Sector) పర్యావరణ వ్యవస్థని అభివృద్ధి చేయడంలో ఇది ఉపయోగకరంగా ఉండేలా చూసుకున్నామని నౌకాదళ సెమినార్‌లో పాల్గొన్న ప్రధాని మోదీ(PM Modi)  వ్యాఖ్యానించారు. భారత కంపెనీల నుంచి రక్షణ పరికరాల కొనుగోలు కోసం బడ్జెట్‌లో ఎక్కువ భాగం వెచ్చిస్తున్నట్లు చెప్పారు. గత నాలుగైదేళ్లలో రక్షణ దిగుమతులు దాదాపు 21 శాతం తగ్గాయని.. ప్రధాన రక్షణ దిగుమ‌తుల నుంచి ప్రధాన ఎగుమ‌తిదారుగా వేగంగా పయనిస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచ వేదికపై భారతదేశం తనను తాను స్థాపించుకుంటున్నందున.. తప్పుడు సమాచారం, ప్రచారం ద్వారా మనపై నిరంతరం దాడి జరుగుతోందని ప్రధాని మోదీ అన్నారు.

    దేశ రక్షణ ఇకపై సరిహద్దులకే పరిమితం కాదని.. ఇది చాలా విస్తృతమైనది వ్యాఖ్యానించారు. ప్రభుత్వ దృష్టిలో మనం సవాళ్లను ఎదుర్కోవాలని.. భారతదేశ ప్రయోజనాలను దెబ్బతీయాలనుకునే శక్తుల ప్రయత్నాలను తిప్పికొట్టాలని సూచించారు. స్వాతంత్ర్యానికి ముందు కూడా భారత రక్షణ రంగం చాలా పటిష్టంగా ఉండేదని ప్రధాని మోదీ అన్నారు. ఈ విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసునని ప్రధాని మోదీ అన్నారు.



    రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో రక్షణ పరికరాల ప్రధాన సరఫరాదారులుగా ఉన్నామని.. మనకు 18 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ఉన్నాయని అన్నారు. వాటి నుండి ఫిరంగులు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళాయని చెప్పారు. ఒకప్పుడు రక్షణ పరికరాల అంశంలో ప్రధాన సరఫరాదారుగా ఉన్నామని.. కానీ తరువాత రక్షణ రంగంలో అతిపెద్ద దిగుమతిదారుగా మారామని ప్రధాని మోదీ అన్నారు. భారత్ ఆత్మవిశ్వాసం, స్వావలంబనను సవాలు చేసే శక్తులపై యుద్ధాన్ని ఉధృతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

    Uddhav Thackrey: ఉద్ధవ్ థాక్రేకు మరో బిగ్ షాక్.. ఏక్‌నాథ్ షిండే వర్గంలోకి 12 మంది ఎంపీలు.. మరికాసేపట్లో ఢిల్లీ పయనం..

    President Of India: భారత రాష్ట్రపతి జీతం 20 ఏళ్లలో ఎంత పెరిగిందో తెలుసా.. ఇతరత్రా ప్రయోజనాలు ఇవే.. పూర్తి వివరాలు

    అలాంటి ప్రతి ప్రయత్నాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మనపై విశ్వాసం ఉంచుకుని దేశంలోనైనా, విదేశాల్లోనైనా భారత ప్రయోజనాలను దెబ్బతీసే శక్తులు తమ ప్రతి ప్రయత్నాన్ని తిప్పికొట్టాలన్నారు. దేశాన్ని రక్షించాలంటే మనం మరో ముఖ్యమైన అంశంపై దృష్టి సారించాలని అన్నారు. భారతదేశ ఆత్మవిశ్వాసాన్ని, మన స్వావలంబనను సవాలు చేసే శక్తులకు వ్యతిరేకంగా మనం యుద్ధాన్ని ఉధృతం చేయాలి.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Indian Navy, Pm modi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు