PM NARENDRA MODI SAYS DYNASTIC POLITICS IS A BIG THREAT TO DEMOCRACY IN INDIA TARGETS SAMAJWADI PARTY IN UTTAR PRADESH AK
PM Modi: రాజవంశ రాజకీయాలు దేశానికి ముప్పు.. ఎస్పీపై ప్రధాని మోదీ ఫైర్
పీఎం మోదీ (Image Credit:PTI)
PM Modi Interview: ప్రభుత్వానికి వ్యాపారం చేసే పని లేదన్నది తమ అభిప్రాయమని.. ఇది సోషలిజంతో ఎలా కనెక్ట్ అవుతుందని ఆయన ప్రశ్నించారు. ఇది సోషలిజానికి విరుద్ధమని ప్రధాని మోదీ అన్నారు.
రాజవంశ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి అతిపెద్ద ముప్పు అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. అవి దేశానికి అతిపెద్ద శత్రువు అని వ్యాఖ్యానించారు. యూపీ ఎన్నికల్లో పోలింగ్‌కు కొద్ది గంటల ముందు ప్రధాని మోదీ ANIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి పోటీ ఇస్తుందని భావిస్తున్న సమాజ్‌వాదీ పార్టీని ఆయన టార్గెట్ చేశారు. వంశపారంపర్య పార్టీలలో అధ్యక్షుడు, పార్లమెంటరీ బోర్డు చీఫ్ వంటి పదవులు ఒక వ్యక్తికి వస్తాయని ప్రధాని మోదీ అన్నారు. కొన్ని కారణాల వల్ల వ్యక్తి అక్కడ లేకపోతే, అతని కుమారుడు అతని స్థానంలో ఉంటారని చెప్పారు. హర్యానా, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, తమిళనాడులోని పార్టీలలో రాజవంశ రాజకీయాలు ప్రబలంగా ఉన్నాయని.. కుటుంబమే పార్టీని నడుపుతుందని ప్రధాని మోదీ అన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి పెద్ద ప్రమాదమని అన్నారు. రాజవంశ రాజకీయాలు యువతను రాజకీయాల్లోకి రాకుండా ఆపుతాయని ఆరోపించారు. అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీలో వారి కుటుంబానికి చెందిన 45 మంది వివిధ పదవుల్లో ఉన్నారని పేర్కొంటూ ఎవరో ఒకసారి తనకు లేఖ పంపారని అన్నారు.
ప్రభుత్వ విధానాలపై కూడా ప్రధాని మోదీ క్లారిటీ ఇచ్చారు. జనసంఘ్ కాలం నుండి తమ ఆర్థిక సూత్రాలు ప్రజలపై, వారి సామర్థ్యాలపై నమ్మకం కలిగేలా చేస్తున్నాయని అన్నారు. ప్రభుత్వ విధానాలు ప్రజలకు అవకాశాలను అందించాలని తెలాపరు. వారికి గరిష్ట అవకాశం వచ్చేలా పాలసీలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ప్రభుత్వానికి వ్యాపారం చేసే పని లేదన్నది తమ అభిప్రాయమని.. ఇది సోషలిజంతో ఎలా కనెక్ట్ అవుతుందని ఆయన ప్రశ్నించారు. ఇది సోషలిజానికి విరుద్ధమని ప్రధాని మోదీ అన్నారు.
ప్రభుత్వ పని పేదలను ఆదుకోవడం, ఆహారం, మరుగుదొడ్లు, ఇళ్ళు, స్వచ్ఛమైన తాగునీరు, ప్రజలకు రోడ్లు వంటివి అందించడం చేస్తుందని ప్రధాని మోదీ అన్నారు. పేదలు అనారోగ్యం పాలైతే వారిని ఆదుకోవడమే ప్రభుత్వ కర్తవ్యమని స్పష్టం చేశారు. చిన్న రైతుల ఉత్పత్తులు మార్కెట్‌కు ఎలా చేరుతాయో చూడడమే ప్రభుత్వ పని అని అన్నారు. ఇవన్నీ అందించడమే తమ ప్రాధాన్యత అని అన్నారు.
సోషలిస్టు నేతలు రామ్ మనోహర్ లోహియా, జార్జ్ ఫెర్నాండెజ్‌లను ఉద్దేశించి ప్రధాని మోదీ పలు వ్యాఖ్యలు చేశారు. వారు ఎప్పుడైనా కుటుంబాలపై పెత్తనం చెలాయించారా అని ప్రశ్నించారు. ఎవరైనా లోహియా కుటుంబాన్ని ఎక్కడైనా చూస్తున్నారా అని అన్నారు. ఆయన సోషలిస్టు అని చెప్పారు. జార్జ్ ఫెర్నాండెజ్ కుటుంబాన్ని ఎవరైనా చూస్తున్నారా అని వ్యాఖ్యానించారు. బీహార్‌లోని నితీష్ కుమార్ తమతో కలిసి పని చేస్తున్నారని.. ఆయన కూడా సోషలిస్టు అని తెలిపారు. ఆయన కూడా తన కుటుంబాన్ని రాజకీయాలకు దూరంగానే ఉంచుతున్నారని అన్నారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.