సీఏఏపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..

పౌరసత్వ చట్టం(Citizenship Act)పై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఆ చట్టాన్ని తీసుకొచ్చి అనాదిగా జరుగుతున్న అన్యాయాన్ని సరిచేశామని అన్నారు.

news18-telugu
Updated: January 28, 2020, 7:53 PM IST
సీఏఏపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..
ప్రధాని మోదీ
  • Share this:
పౌరసత్వ చట్టం(Citizenship Act)పై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఆ చట్టాన్ని తీసుకొచ్చి అనాదిగా జరుగుతున్న అన్యాయాన్ని సరిచేశామని అన్నారు. పక్క దేశాల్లో మైనారిటీలుగా ఉన్న వారికి పౌరసత్వం కల్పించాలనేది బీజేపీ హామీ అని.. దాన్ని నెరవేర్చామని చెప్పారు. నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ర్యాలీలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పై వ్యాఖ్యలు చేశారు. కొందరు పౌరసత్వ చట్టానికి మతం రంగును పూస్తున్నారని, వారి నిజస్వరూపం ఇప్పుడు బయటపడిందని వ్యాఖ్యానించారు. పాక్ ఆర్మీలో శానిటేషన్ వర్క్స్ కోసం ముస్లిమేతరులనే తీసుకోనున్నట్లు ప్రకటన ఇచ్చారని గుర్తుచేశారు. ఆ దేశంలో మైనారిటీలు వివక్ష ఎదుర్కొంటున్నారని చెప్పేందుకే ఇదో నిదర్శనమని అన్నారు. దశాబ్ధాలుగా దేశం ఎదుర్కొంటున్న పలు సమస్యలను తమ ప్రభుత్వం పరిష్కరిస్తోందని మోదీ అన్నారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: January 28, 2020, 7:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading