హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Farmers Protest: రైతులతో చర్చలకు డోర్లు తెరిచే ఉన్నాయి.. ప్రధాని మోదీ

Farmers Protest: రైతులతో చర్చలకు డోర్లు తెరిచే ఉన్నాయి.. ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ

రైతు సంస్కరణల చట్టాలపై అన్నదాతలతో చర్చలకు ప్రభుత్వం డోర్లు తెరిచే ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రధానమంత్రి మాట్లాడారు.

రైతు సంస్కరణల చట్టాలపై అన్నదాతలతో చర్చలకు ప్రభుత్వం డోర్లు తెరిచే ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రధానమంత్రి మాట్లాడారు. జనవరి 22వ తేదీన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చెప్పినట్టు రైతు చట్టాల అమలును ఏడాది పాటు నిలిపివేస్తామనే విషయంలో ప్రభుత్వం వైఖరి మారలేదని, రైతులతో చర్చలకు ఎప్పుడూ సిద్ధంగా, సుముఖంగా ఉందని చెప్పారు. అలాగే, తోమర్ ఒక్క ఫోన్ కాల్ దూరంలో అందుబాటులో ఉంటారన్నారు. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీలో జరిగిన హింసను ప్రధానమంత్రి ఖండించారు. దీనిపై చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. అలాగే, ఈ రోజు జాతిపిత మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా ప్రధాని మోదీ బాపు చిత్రపటానికి నివాళి అర్పించారు. మహాత్ముడి కలలను మనం సాకారం చేయాలన్నారు. అమెరికాలో బాపు విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ఈ భూమ్మీద అలాంటి హింసకు తావులేదన్నారు.

ఇక పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సుజావుగా జరగాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. సభలో సమగ్రమైన చర్చలు జరగాలన్నారు. పదే పదే పెద్ద పార్టీలు సభా సమయానికి ఆటంకం కలిగిస్తే దాని వల్ల చిన్న చిన్న పార్టీలు తమ ఆలోచనలను, అభిప్రాయాలను చెప్పే అవకాశాలు కోల్పోతాయన్నారు. ఇది సమంజసం కాదని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. కాబట్టి, పార్లమెంట్ సమావేశాలు చక్కగా, ఎలాంటి అవాంతరాలు జరిగేలా చూడాల్సిన బాధ్యత పెద్ద పార్టీల మీదే ఉందన్నారు. ఎలాంటి అవాంతరాలు కల్పించకపోతే చిన్న పార్టీలు తమ భావాలను వ్యక్తపరిచే అవకాశం లభిస్తుందన్నారు.

ప్రపంచ బాగు కోసం భారత్ ఇంకా ఏయే రంగాల్లో పాటుపడగలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేశారు. దేశ ప్రజల నైపుణ్యం, సామర్థ్యం ప్రపంచానికి మంచి చేస్తుందన్నారు.

జనవరి 29 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. రైతులతో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా 16 రాజకీయ పార్టీలు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగాన్ని బహిష్కరించాయి. అయితే, వైసీపీ, టీఆర్ఎస్, టీడీపీలు మాత్రం రాష్ట్రపతి ప్రసంగానికి హాజరయ్యాయి.

First published:

Tags: Budget 2021, Farmers Protest, New Agriculture Acts, Pm modi, Union Budget 2021

ఉత్తమ కథలు