PM Modi: కరోనా థర్డ్ వేవ్‌కు సన్నద్ధం.. ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుపై ప్రధాని సమీక్ష

ప్రధాని నరేంద్ర మోదీ (ఫైల్ ఫోటో)

PM Modi on Oxygen plants: ఆక్సిజన్ ప్లాంట్లకు సంబంధించి రాష్ట్రాలతో సమన్వయం చేసుకోవాలని ప్రధాని అధికారులను ఆదేశించారు.

  • Share this:
    కరోనా థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర దృష్టి పెట్టింది. సెకండ్ వేవ్ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని థర్డ్ వేవ్ వస్తే.. తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై ఫోకస్ చేస్తోంది. ఈ క్రమంలోనే దేశంలో ఏర్పాటు చేయనున్న ఆక్సిజన్ ప్లాంట్లపై ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న 1500 పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్ల ద్వారా దాదాపు 4 లక్షల బెడ్లకు మెడికల్ ఆక్సిజన్ అందించవచ్చిన భావిస్తున్న కేంద్రం.. వాటిని సాధ్యమైనంత తొందరగా వాడుకలోని తీసుకురావాలని భావిస్తోంది. వీటిపై అధికారులు ప్రధానికి వివరించారు. వీటిని సాధ్యమైనంత తొందరగా సిద్ధం చేయాలని ప్రధాని మోదీ అధికారులను ఆదేశించారు.

    ఈ ప్లాంట్ల నిర్వహణకు సంబంధించి ఆస్పత్రి సిబ్బందికి సరైన శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఇందుకోసం 8 వేల మందికి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నట్టు అధికారులు ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు. ఆక్సిజన్ ప్లాంట్లకు సంబంధించి రాష్ట్రాలతో సమన్వయం చేసుకోవాలని ప్రధాని అధికారులను ఆదేశించారు. వీటి పనితీరును పర్యవేక్షించేందుకు వీటిని టెక్నాలజీని అనుసంధానం చేయాలని సూచించారు. ఇందుకోసం ఓ పైలెట్ ప్రాజెక్టును కూడా రూపొందించాలని ఆదేశించారు.
    Published by:Kishore Akkaladevi
    First published: