సూడాన్‌ పేలుడులో భారతీయుల మృతిపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

మృతుల కుటుంబాలకు ట్విటర్ వేదికగా సంతాపం ప్రకటించారు ప్రధాని. ప్రమాద బాధితులకు సూడాన్‌లోని భారత రాయబార కార్యాలయం సహాయక సహకారాలు అందిస్తుందని పేర్కొన్నారు.

news18-telugu
Updated: December 4, 2019, 10:54 PM IST
సూడాన్‌ పేలుడులో భారతీయుల మృతిపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
సూడాన్‌లో భారతీయుల మృతిపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
  • Share this:
సూడాన్‌లో పేలుడు ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ ఘటనలో 18 మంది భారతీయులు చనిపోవడం బాధాకరమని ఆయన అన్నారు. మృతుల కుటుంబాలకు ట్విటర్ వేదికగా సంతాపం ప్రకటించారు ప్రధాని. ప్రమాద బాధితులకు సూడాన్‌లోని భారత రాయబార కార్యాలయం సహాయక సహకారాలు అందిస్తుందని పేర్కొన్నారు.

సూడాన్ పేలుడు ఘటనలో పలువురు భారతీయులు మృతి చెందిన వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యా. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా.
నరేంద్ర మోదీ





మంగళవారం రాత్రి సూడాన్ రాజధాని ఖర్తూమ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. సీరా సిరామిక్ ఫ్యాక్టరీలో ఎల్‌పీజీ ట్యాంకర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి.ఈ ప్రమాదంలో 23 మంది చనిపోయారు. మరో 130 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో 18 మంది భారతీయులు ఉన్నట్లు అక్కడి ఇండియన్ ఎంబసీ ప్రకటించింది. మరో 16 మంది గల్లంతయ్యారని.. వారిలో కొందరు చనిపోయిన ఉండవొచ్చని వెల్లడించింది. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో గుర్తించలేకపోతున్నామని తెలిపింది.

ఇక ఈ ఘటనలో 34 మంది భారతీయులు సురక్షితంగా బయటపడగా.. మరో ఏడుగురు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంబసీ అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి సమీక్షిస్తున్నారని.. వివరాల కోసం 24 గంటల ఎమర్జెన్సీ హాట్‌లైన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
First published: December 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...