నిండు గర్భిణిని 4గంటల పాటు మోసిన భారత జవాన్లు... సెల్యూట్ చేసిన మోదీ

నాలుగు గంటల పాటు.. వందమంది ఆర్మీ జవాన్లు... పురిటినొప్పులతో సతమతమవుతున్నా షమీమా అనే మహిళను ఆస్పత్రికి మోసుకెళ్లారు.

news18-telugu
Updated: January 15, 2020, 12:41 PM IST
నిండు గర్భిణిని 4గంటల పాటు మోసిన భారత జవాన్లు... సెల్యూట్ చేసిన మోదీ
నిండుగర్భిణిని మోస్తున్న ఆర్మీ జవాన్లు
  • Share this:
భారత ఆర్మీ.. వారు చేసిన సేవలను, త్యాగాలను ఎంతగా చెప్పుకొన్న తక్కువ. కుటుంబాల్ని వదిలి దేశ సేవ కోసం సరిహద్దుల్లో నిత్యం గస్తీ కాస్తుంటారు. ఎండ, వాన, చలి అని తేడా లేకుండా నిత్యం కంటికి రెప్పలా భారతజాతిని రక్షిస్తుంటారు. ఎక్కడ ఎలాంటి కష్టం వచ్చినా మీకు మేమున్నామంటూ ఆర్మీ సామాన్యులకు కొండంత అండనిస్తుంది. ఇవాళ ఆర్మీ డే.ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఓ ట్వీట్ చేశారు. ఇండియన్ ఆర్మీకి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. దీంతో పాటు... తీవ్రంగా కురుస్తున్న మంచులో ఆర్మీ జవాన్లు... షమీమా అనే నిండు గర్భిణిని మోసుకెళ్తున్న వీడియోను షేర్ చేశారు. నాలుగు గంటల పాటు.. వందమంది ఆర్మీ జవాన్లు... పురిటినొప్పులతో సతమతమవుతున్నా షమీమా అనే మహిళను ఆస్పత్రికి మోసుకెళ్లారు. మామూలుగా మనం ఐదు కిలోల బరువు మోయాలంటేనే కిందమీద పడిపోతుంటాం. అలాంటి జవాన్లు ఓ వైపు చలి, మరోవైపు భారీగా కురుస్తున్న మంచు.. అయినాసరే అవేం పట్టించుకోకుండా తమ ప్రాణాల్ని సైతం లెక్కచేయకుండా గర్భిణి మహిళతో పాటు... ఆమె కడుపులో ఉన్న బిడ్డ కోసం నాలుగు గంటలపాటు... మంచులో నడిచి తల్లితో పాటు... బిడ్డ ప్రాణాల్ని సైతం కాపాడారు. ఆర్మీతో పాటు.. పలువురు సామాన్య పౌరులు కూడా వారి వెంట నడిచారు. దీంతో ఆమె ఆస్పత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు మోదీ ట్వీట్ చేశారు. ప్రధాని చేసిన ట్వీట్ చేసిన ఈ వీడియోకు వేలల్లో లైకులు వస్తున్నాయి. ఆర్మీ జవాన్లకు గ్రేట్ సెల్యూట్ అంటూ నెటిజన్ల అంతా మెసేజ్‌లు పెడుతున్నారు. ఆర్మీ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.First published: January 15, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు