ఆ రెండూ బాగున్నాయ్.. ఏపీ పోలీసులపై ప్రధాని మోదీ ప్రశంసలు..

ఏపీ పోలీసులు తీసుకొచ్చిన ‘స్పందన,’, ‘వీక్లీ ఆఫ్ సిస్టమ్‌’ గురించి ప్రధాని మోదీ వివరాలు అడిగి తెలుసుకున్నారు.

news18-telugu
Updated: October 31, 2019, 6:28 PM IST
ఆ రెండూ బాగున్నాయ్.. ఏపీ పోలీసులపై ప్రధాని మోదీ ప్రశంసలు..
పోలీస్ టెక్నికల్ ఎగ్జిబిషన్‌లో స్టాల్స్‌ను పరిశీలిస్తున్న ప్రధాని మోదీ
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ శాఖ తీసుకొచ్చిన రెండు విధానాలు బాగున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. వాటి గురించి సమగ్రంగా తనకు వివరాలు తెలపాలని కోరారు. గుజరాత్‌లోని వడోదరలో పోలీస్ టెక్నికల్ ఎగ్జిబిషన్ జరుగుతోంది. దేశంలోని 29 రాష్ట్రాలకు చెందిన పోలీస్ శాఖలు తమ తమ స్టాల్స్‌ను అక్కడ ఏర్పాటు చేశాయి. అందులో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన స్టాల్ కూడా ఉంది. ఆ ఎగ్జిబిషన్‌ను పరిశీలించిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఏపీ స్టాల్ వద్ద కొద్దిసేపు ఆగారు. ఏపీ పోలీసులు తీసుకొచ్చిన ‘స్పందన,’, ‘వీక్లీ ఆఫ్ సిస్టమ్‌’ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్పందన, వీక్లీ ఆఫ్ ల పనితీరును ప్రశంసిస్తూ వాటిపై పూర్తి స్దాయిలో వివరాలు అందజేయాలని అధికారులను ఆదేశించారు. నేటి నుంచి నవంబర్ వరకు ఈ ఎగ్జిబిషన్ కొనసాగనుంది.

First published: October 31, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>