• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • PM NARENDRA MODI PAYS TRIBUTE TO RAJIV GANDHI ON HIS 75TH BIRTH ANNIVERSARY

Rajiv Gandhi 75: రాజీవ్ గాంధీకి ప్రధాని నరేంద్ర మోదీ నివాళి

Rajiv Gandhi 75: రాజీవ్ గాంధీకి ప్రధాని నరేంద్ర మోదీ నివాళి

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ (Image:Getty)

Rajiv Gandhi 75th birth anniversary | మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్ గాంధీ 75వ జయంతి సందర్భంగా ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. అటు రాజీవ్ గాంధీ సమాధి వద్ద పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.

  • Share this:
    ధివంగత మాజీ ప్రధాని, భారత రత్న రాజీవ్ గాంధీ 75వ జయంతి వేడుకలను దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా జరుపుకుంటున్నారు. అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘సద్భావన దివస్’గా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు జరుపుకుంటున్నారు. 1944 ఆగస్టు 20న ముంబైలో రాజీవ్ గాంధీ జన్మించారు. రాజీవ్ గాంధీ 75వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ఓ ట్వీట్ చేశారు. అలాగే రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి నివాళులర్పించారు.


    రాజీవ్ గాంధీకి రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నివాళి...



    వీర్ భూమి వద్ద కాంగ్రెస్ ప్రముఖుల నివాళి

    రాజీవ్ గాంధీ 75వ జయంతి సందర్భంగా ఆయన సమాధి(వీర్ భూమి) వద్ద పలువురు కాంగ్రెస్ ప్రముఖులు నివాళులర్పించారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు సమాధి వద్ద నివాళులర్పించారు.



    కాగా రాజీవ్ గాంధీ 75వ జయంతి సందర్భంగా ఆయన ఘనతలను చాటుతూ ఏఐసీసీ ఓ వీడియోను ట్వీట్ చేసింది.

    Published by:Janardhan V
    First published:

    అగ్ర కథనాలు