PM Narendra Modi: కొత్త వ్యవసాయ చట్టాలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

ప్రతీకాత్మక చిత్రం

Narendra Modi: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు రాజకీయ దుర్నీతి, తెలివైన మోసాలకు నిదర్శనమని విమర్శించారు. రైతుల అభివృద్ధి, సంక్షేమం కోసమే ఈ చట్టాలను తెచ్చినట్లు మరోసారి స్పష్టం చేశారు ప్రధాని మోదీ.

 • Share this:
  రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చామని కేంద్రం చెబుతోంది. కానీ వాటితో రైతులు నిండా మునుగుతారని విపక్షలు భగ్గుమంటున్నాయి. ఈ నూతన సాగు చట్టాలపై  ఇంకా దుమారం కొనసాగుతోంది. ఏడాది కాలంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఇటీవలే విపక్షాలు, పలు రైతు సంఘాలు కూడా భారత్ బంద్ నిర్వహించారు. ఈ క్రమంలో కొత్త చట్టాలపై తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఓపెన్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు రాజకీయ దుర్నీతి, తెలివైన మోసాలకు నిదర్శనమని విమర్శించారు. రైతుల అభివృద్ధి, సంక్షేమం కోసమే ఈ చట్టాలను తెచ్చినట్లు మరోసారి స్పష్టం చేశారు ప్రధాని మోదీ.

  ''కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించే వారిని చూస్తుంటే.. తెలివైన వంచన, రాజకీయ దుర్నీతికి అసలైన అర్థం తెలుస్తోంది. మళ్లీ ప్రభుత్వ ఏర్పాటు చేయాలన్న ఒకే ఒక్క మోడల‌్‌తో గత ప్రభుత్వాలు పనిచేశాయి. కానీ మా ప్రాథమి ఆలోచన మాత్రం వేరుగా ఉంటుంది. దేశ నిర్మాణం కోసమే ప్రభుత్వాలు పనిచేయాలని మేం విశ్వసిస్తాం.  చిన్న, సన్నకారు రైతుల సాధికారతే మా లక్ష్యం. వ్యవసాయ చట్టాలపై ఏవైనా అభ్యంతరాలంటే కూర్చొని మాట్లాడేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటికే పలుమార్లు రైతు సంఘాలతో చర్చలు జరిపింది. కానీ ఏ విషయంలో అభ్యంతరాలున్నాయో ఇప్పటి వరకు ఎవరూ స్పష్టంగా చెప్పలేకపోయారు.  అప్పుడు జీఎస్టీ.. ఇప్పుడు ఆధార్, పార్లమెంట్ భవనం విషయంలోనూ అలానే చేస్తున్నారు. ఈ నిర్ణయాలను వ్యతిరేకించే వారు తమ సొంత ప్రయోజనాల కోసం చూస్తున్నారు. నేను ఒక్కటే చెప్పదలచుకున్నా. మోదీ విఫలమయ్యారా? విజయమంతమయ్యారా? అనేది ముఖ్యం కాదు. మన దేశం విజయవంతమవుతుందా? లేదా? అన్నదే చూడాలి.'' అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

  Congress: కష్టాల్లో కాంగ్రెస్.. 7 ఏళ్లలో 177 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా.. లిస్ట్‌లో ఉన్న ప్రముఖులు ఎవరంటే..

  కాగా, గత ఏడాది సెప్టెంబరులో కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చింది కేంద్రం.


  Sputnik V: స్పుత్నిక్‌ టీకాలు వద్దు.. ఆర్డర్లు రద్దు చేసుకుంటున్న ఆసుపత్రులు..


  1.  నిత్యవసర సరుకుల సవరణ చట్టం.
  నిత్యవసర సరకుల జాబితాలో ఉన్న వస్తువుల ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, వాణిజ్యం తదితర కార్యకలాపాల నియంత్రణాధికారం కేంద్రానికి ఉంటుంది. వ్యవసాయ రంగంలో పోటీ, రైతుల ఆదాయం పెంచడానికే ఈ చట్టం తెచ్చినట్లు కేంద్రం చెబుతోంది.


  Central Government: ఆ స్కీమ్ గడువును మరోసారి పొడిగించిన కేంద్రం..
  2. రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార (ప్రోత్సాహక, సులభతర) చట్టం
  వ్యసాయ మార్కెట్లను నియంత్రించే మార్కెట్ కమిటీలతో సంబంధం లేకుండా... దేశంలో ఎక్కడైనా తమ ఉత్పత్తులను అమ్ముకునే స్వచ్ఛను రైతులకు ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. మార్కెట్ కమిటీల సరిహద్దులు దాటి విక్రయించే వ్యవసాయ ఉత్పత్తులపై రాష్ట్రాలు కానీ, స్థానిక ప్రభుత్వాలు కానీ ఎలాంటి పన్నులు, ఫీజులు  వసూలు చేయడానికి వీలు పడదు.


  Air India | TATA: టాటా సన్స్ చేతికి ఎయిర్ ఇండియా.. 67 ఏళ్ల తర్వాత మళ్లీ  సొంత గూటికి..
  3. రైతుల (సాధికారత, రక్షణ) ధర హామీ, సేవల ఒప్పంద చట్టం-2020
   ఏ వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించైనా పంట వేయడానికి ముందే రైతులు, కొనుగోలుదారు ఒప్పందం కుదుర్చుకునే వీలు కల్పిస్తుందీ చట్టం. అంటే కాంట్రాక్ట్ ఫార్మింగ్ అన్న మాట.

  ఐతే ఈ చట్టాలను ముఖ్యంగా పంజాబ్, హర్యానా, యూపీలోని కొన్ని రైతు సంఘాలు తీవ్రంగా తప్పుబట్టుతున్నాయి. ఇందులో కనీస మద్దతు ధర ఊసే లేదని మండిపడుతున్నాయి. కానీ కేంద్రం మాత్రం కొత్త చట్టాల వల్ల రైతులకే లాభమే జరుగుతుంది తప్ప.. నష్టం జరగదని చెబుతోంది.
  Published by:Shiva Kumar Addula
  First published: