హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

PM Narendra Modi: అమ్మకానికి ప్రధాని మోదీ ఆఫీసు.. షాకైన పోలీసులు.. నిందితుల అరెస్ట్

PM Narendra Modi: అమ్మకానికి ప్రధాని మోదీ ఆఫీసు.. షాకైన పోలీసులు.. నిందితుల అరెస్ట్

ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ

PM Narendra Modi: ఏకంగా వారణాసిలోని ప్రధాని నరేంద్రమోదీ కార్యాలయాన్ని కొందరు ఆకతాయిలు ఓఎల్ఎక్స్‌లో అమ్మకానికి పెట్టారు.

  సోషల్ మీడియా వేదికగా కొందరు ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. విచక్షణ లేకుండా ఇష్టమొచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా కొందరు ఆకతాయిలు ఇలాంటి పని చేసి కటకటాల పాలయ్యారు. ఏకంగా వారణాసిలోని ప్రధాని నరేంద్రమోదీ కార్యాలయాన్ని కొందరు ఆకతాయిలు ఓఎల్ఎక్స్‌లో అమ్మకానికి పెట్టారు. వారణాసిలోని గురుధామ్ కాలనీలో ఉన్న ప్రధానమంత్రి కార్యాలయాన్ని రూ. 7.5 కోట్లకు కొందరు ఆకతాయిలు ఓఎల్ఎక్స్‌లో అమ్మకానికి పెట్టారు. ఈ యాడ్ ప్రకారం లక్ష్మీకాంత్ ఓజా అనే వ్యక్తి ప్రధాని కార్యాలయాన్ని అమ్మకానికి పెట్టాడు. ఇందులో నాలుగు బెడ్ రూమ్‌లు, నాలుగు బాత్‌రూమ్‌లు మొత్తంగా 6,500 చదరపు అడుగులు ఉన్నట్టు పేర్కొన్నారు. రెండు అంతస్థులు, రెండు కార్ల పార్కింగ్‌కు సంబంధించిన స్పేస్ ఉండే ఈ భవనాన్ని మినీ పీఎంవోగా తెలిపారు.

  ఈ విషయం పోలీసులకు దృష్టికి రావడంతో ముందుగా వాళ్లు కూడా అవాక్కయ్యారు. ఈ పరిణామాన్ని ఊహించలేకపోయారు. ఈ యాడ్‌‌ను వెంటనే తొలగించారు. బెలుపూర పోలీస్ స్టేషన్ పరిధిలో ఇందుకు సంబంధించిన కేసు నమోదు చేశారు. కొన్ని అసాంఘిక శక్తులు ఈ రకమైన చర్యలు పాల్పడ్డాయని వారణాసి సీనియర్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ అమిత్ పాఠక్ తెలిపారు. లక్ష్మీకాంత్ ఓజా సహా నలుగురికి అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.

  Pm modi Varanasi office, pm narendra modi news, pmo office in Varanasi for sale, Varanasi pmo office, pm modi office for sale, ప్రధాని మోదీ ఆఫీసు, ప్రధాని మోదీ ఆఫీసు అమ్మం, వారణాసిలో ప్రధాని మోదీ కార్యాలయం అమ్మకం, ప్రధాని మోదీ న్యూస్
  యాడ్‌కు సంబంధించిన పోస్ట్


  ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ నగరాల్లో ఒకటైన వారణాసి లోక్ సభ నియోజకవర్గానికి ప్రధాని నరేంద్రమోదీ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలను స్థానికంగా ఉండే ప్రధానమంత్రి కార్యాలయం ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటుంది. ఈ కార్యాలయ వ్యవహారాలను స్థానిక బీజేపీ నేతలతో పాటు ప్రధాని మోదీ ప్రతినిధి పర్యవేక్షిస్తుంటారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Pm modi, Varanasi

  ఉత్తమ కథలు