నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పరాక్రమ్ దివాస్ (Parakram Diwas)గా జరుపుకుంటారు. నేతాజీ జయంతి జనవరి 23ని పరాక్రమ్ దివాస్‌గా 2021లో ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా సోమవారం జరిగిన కార్యక్రమంలో అండమాన్, నికోబార్ దీవుల్లోని 21 పేరులేని దీవులకు ప్రధాని నరేంద్ర మోదీ పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేర్లు పెట్టారు. ఇంతకుముందు రాస్ ఐలాండ్స్ అని పిలిచే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీప్‌లో నిర్మించనున్న, నేతాజీకి అంకితం చేసిన నేషనల్ మెమోరియల్ నమూనాను కూడా మోదీ ఆవిష్కరించారు. అండమాన్ నికోబార్ దీవుల్లో జరిగిన వేడుకల్లో హోంమంత్రి అమిత్ షా కూడా పాల్గొన్నారు.
* 21 మంది పరమవీర చక్ర అవార్డు గ్రహీతలు వీళ్లే
పేరులేని అతిపెద్ద ద్వీపానికి మొదటి పరమవీర చక్ర అవార్డు గ్రహీత, మేజర్ సోమనాథ్ శర్మ పేరు పెట్టారు. ఆయన 1947 నవంబర్ 3న శ్రీనగర్ విమానాశ్రయం సమీపంలో పాకిస్థానీ చొరబాటుదారులతో పోరాడుతున్నప్పుడు ప్రాణాలను విడిచారు.
1.మేజర్ సోమనాథ్ శర్మ
2. సుబేదార్, ఆనరీ కెప్టెన్ కరమ్ సింగ్ PVC, MM
3. 2వ లెఫ్టినెంట్ రామ రఘోబా రాణే
4. నాయక్ జాదు నాథ్ సింగ్
5. కంపెనీ హవల్దార్ మేజర్ పిరు సింగ్
6. కెప్టెన్ GS సలారియా
7.లెఫ్టినెంట్ కల్నల్ (అప్పటి మేజర్) ధన్ సింగ్ థాపా
8.సుబేదార్ జోగిందర్ సింగ్
9.మేజర్ షైతాన్ సింగ్
10.CQMH.అబ్దుల్ హమీద్
11.లెఫ్టినెంట్ కల్నల్ అర్దేషిర్ బుర్జోర్జీ తారాపూర్
12.లాన్స్ నాయక్ ఆల్బర్ట్ ఎక్కా
13.మేజర్ హోషియార్ సింగ్
14.2వ లెఫ్టినెంట్ అరుణ్ ఖేత్రపాల్
15. ఫ్లయింగ్ ఆఫీసర్ నిర్మల్‌జిత్ సింగ్ సెఖోన్
16.మేజర్ రామస్వామి పరమేశ్వరన్
17.నాయిబ్ సుబేదార్ బనా సింగ్
18. కెప్టెన్ విక్రమ్ బాత్రా
19.లెఫ్టినెంట్ మనోజ్ కుమార్ పాండే
20.సుబేదార్ మేజర్ (అప్పటి రైఫిల్ మ్యాన్) సంజయ్ కుమార్
21. సుబేదార్ మేజర్ రిటైర్డ్ (ఆనరీ కెప్టెన్) గ్రెనేడియర్ యోగేంద్ర సింగ్ యాదవ్
* రాస్ ఐలాండ్స్‌కు నేతాజీ పేరు
2018లో రాస్ ఐలాండ్స్‌ను ప్రధాని మోదీ సందర్శించారు. అండమాన్ & నికోబార్ దీవుల చారిత్రక ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, నేతాజీ జ్ఞాపకార్థం ఆ ఐలాండ్స్‌కు నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరు పెట్టారు. నీల్ ఐలాండ్, హావ్‌లాక్ ఐలాండ్‌కు వరుసగా షహీద్ ద్వీప్, స్వరాజ్ ద్వీప్ అని పేరు మార్చారు. పరాక్రమ్ దివాస్ సందర్భంగా పీఎంవో విడుదల చేసిన ప్రకటనలో.. దేశంలోని నిజ జీవితంలోని హీరోలకు సముచిత గౌరవం ఇవ్వడానికి ప్రధానమంత్రి ఎల్లప్పుడూ అత్యంత ప్రాధాన్యం ఇస్తారని పేర్కొంది.
ఈ స్ఫూర్తితో ముందుకు వెళుతూ ఇప్పుడు ద్వీప సమూహంలోని 21 పెద్ద పేరులేని ద్వీపాలకు 21 మంది వీరుల పేరు పెట్టాలని నిర్ణయించారని తెలిపింది. పేరులేని అతిపెద్ద ద్వీపానికి మొదటి పరమవీర చక్ర అవార్డు గ్రహీత పేరు పెట్టారు. రెండో అతిపెద్ద పేరులేని ద్వీపానికి రెండవ పరమవీర చక్ర అవార్డు గ్రహీత పేరు పెట్టారు. ఇలా అన్ని ద్వీపాలకు అవార్డు గ్రహీతల పేర్లు సెలక్ట్ చేశారు.
ఇది కూడా చదవండి : Kutch War Memorial : చరిత్రకు నిలువుటద్దం కచ్ వార్ మెమోరియల్.. తప్పక చూడండి
* స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర
1897 జనవరి 23న జన్మించిన నేతాజీ భారత స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించారు. , 1945 ఆగస్ట్ 18న తైపీలో జరిగిన విమాన ప్రమాదంలో బోస్ మరణించడంపై వివాదం నడుస్తుండగా, కేంద్ర ప్రభుత్వం 2017లో ఆర్టీఐ (సమాచార హక్కు)లో ఆయన మరణించినట్లు నిర్ధారించింది. గతేడాది నేతాజీ 125వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద స్వాతంత్య్ర సమరయోధుడు హోలోగ్రామ్ విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andaman, National News, Pm modi, PM Narendra Modi