Home /News /national /

PM NARENDRA MODI MEETS PRESIDENT RAMNATH KOVIND OVER SECURITY ISSUE SC TO HEAR PLEA TOMORROW SK

PM Narendra Modi: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో ప్రధాని మోదీ భేటీ.. పంజాబ్‌ ఘటనపై చర్చ

రాష్ట్రపతిని కలిసిన ప్రధాని మోదీ

రాష్ట్రపతిని కలిసిన ప్రధాని మోదీ

PM Narendra Modi: ప్రధాని రూట్ మ్యాప్ ఎలా లీకయిందని.. దీని వెనక కాంగ్రెస్ కుట్ర ఉందని బీజేపీ ఆరోపిస్తోంది. ప్రధాని షెడ్యూల్, రూట్ మ్యాప్ వివరాలను అందించినా సెక్యూరిటీ ఇవ్వలేకపోయారని దుమ్మెత్తిపోస్తోంది.

    ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) పంజాబ్ పర్యటన (Modi Punjab Tour)లో భద్రతా లోపాలపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. అక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేసిందని బీజేపీ ఆరోపిస్తుంటే.. కాంగ్రెస్ మాత్రం ఎదురు దాడి చేస్తోంది. మోదీ సభలో జనం లేకపోవడంతో.. అక్కడి నుంచి బయపడేందుకు సెక్యూరిటీ లోపం పేరిట డ్రామాలాడుతున్నారని కాంగ్రెస్ విమర్శిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు. అక్కడ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో ఆయన భేటీ అయ్యారు. పంజాబ్ పర్యటన సందర్భంగా తలెత్తిన భద్రతా లోపాలపై చర్చించారు. ఫిరోజ్‌పూర్‌లో నిన్న జరిగిన పరిణామాలను రాష్ట్రపతికి వివరించారు ప్రధాని మోదీ.



    కాటుక కళ్లతో కవ్విస్తోన్న రష్మి గౌతమ్.. కొత్త లుక్‌లో అదరగొట్టిన జబర్ధస్త్ భామ.

    అటు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ప్రధాని మోదీకి కాల్ చేసి మాట్లాడారు. నిన్నటి ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు.



    మరోవైపు దేశవ్యాప్తంగా బీజేపీ నేతలు ప్రధాని మోదీ ఆయురారోగ్యాలతో ఉండాలని పూజలు చేస్తున్నారు. సీఎంలు, రాష్ట్రాల అధ్యక్షుడు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.





    Ritu Varma : వెరైటీ డ్రెస్‌లో రీతూ వర్మ గ్లామర్ విందు.. పెళ్లి చూపులు భామ పిక్స్ వైరల్..

    ఈ వ్యవహారం గురించి ట్విటర్‌లో నెటిజన్లు ట్వీట్ల మోత మోగిస్తున్నారు. దేశ ప్రధాని భద్రత విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఉంటారని చాలా మంది నెటిజన్లు పంజాబ్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. పంజాబ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తున్నారు.






    ప్రధాని మోదీ పర్యటనలో భద్రతా లోపాలపై విచారణ కోసం పంజాబ్ ప్రభుత్వ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. అసలు ఫిరోజ్‌పూర్‌లో ఏం జరిగిందో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ కమిటీ మూడు రోజుల్లోనే తమ నివేదికను సమర్పించనుంది. ఐతే పంజాబ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కమిటీపై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వారు ఏం తేల్చుతారో తమకు తెలుసని, పంజాబ్ ప్రభుత్వానికి అనుకూలంగానే రిపోర్టు ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు ఫిరోజ్‌పూర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో భద్రతా లోపంపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలయింది. దీనిపై రేపు విచారించనుంది కోర్టు.

    RRR : చిక్కుల్లో రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ మూవీ.. హైకోర్టును ఆశ్రయించిన యువతి..

    కాగా, బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ఫిరోజ్‌పూర్ జిల్లా హుస్సేనివాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనాల్సి ఉంది. ఐతే ఢిల్లీ నుంచి బఠిండా ఎయిర్‌పోర్టుకు వెళ్లిన ఆయన.. అక్కడి నుంచి వాయుమార్గంలో వెళ్లాల్సి ఉంది. కానీ వాతావరణం అనుకూలించక రోడ్డుమార్గంలో వెళ్లారు. సభా వేదికకు మరో 30 నిమిషాల్లో చేరుకుంటారన్న సమయంలో రైతులు ప్రధాని కాన్వాయ్‌ని అడ్డగించారు. వంద రైతులు ధర్నాకు దిగడంతో నరేంద్ర మోదీ వాహనం ఓ ఫ్లైఓవర్‌పై నిలిచిపోయింది. దాదాపు 20 నిమిషాల పాటు ఆయన అక్కడే ఉన్నారు. ఆ తర్వాత తిరిగి వెనక్కి వెళ్లిపోయారు. బఠిండా ఎయిర్‌పోర్టుకు చేరుకొని.. అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లిపోయారు. బఠిండా ఎయిర్‌పోర్టు వరకు ప్రాణాలతో తిరిగి రాగలిగినందుకు మీ సీఎంకు ధన్యవాదాలు చెప్పండని.. పంజాబ్ అధికారులతో అన్నారు ప్రధాని మోదీ.

    ఐతే ప్రధాని రూట్ మ్యాప్ ఎలా లీకయిందని.. దీని వెనక కాంగ్రెస్ కుట్ర ఉందని బీజేపీ ఆరోపిస్తోంది. ప్రధాని షెడ్యూల్, రూట్ మ్యాప్ వివరాలను అందించినా సెక్యూరిటీ ఇవ్వలేకపోయారని దుమ్మెత్తిపోస్తోంది. సీఎం, సీఎస్, డీజీపీ ఎవరూ ప్రధానికి స్వాగతం పలికేందుకు రాలేదని.. ఇదంతా ప్లాన్లో భాగంగానే జరిగిందని మండిపడుతోంది. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం భద్రతా వైఫల్యం పేరుతో ప్రధాని మోదీ డ్రామాలాడుతున్నారని ఎదురుదాడికి దిగింది. హుస్సేనివాలా సభలో జనాలు ఎవరూ లేక ఖాళీ కుర్చీలు కనిపిపించాయని, ఆ సభకు వెళ్లడం ఇష్టం లేకే.. భద్రతా లోపం పేరుతో ప్రధాని వెనక్కి వెళ్లిపోయారని మండిపడుతోంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Narendra modi, Punjab, Ramnath kovind

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు