Home /News /national /

PM NARENDRA MODI MEETS LEADING SIKH INTELLECTUALS IN DELHI DISCUSSES FARMERS WELFARE PUNJABS DEVELOPMENT DETAILS HERE GH VB

PM Modi: సిక్కు ప్రముఖులు, మేధావులతో భేటీ అయిన ప్రధాని మోదీ.. పలు కీలక అంశాలపై చర్చ..

సిక్కు ప్రముఖులు, మేధావులతో భేటీ అయిన ప్రధాని మోదీ

సిక్కు ప్రముఖులు, మేధావులతో భేటీ అయిన ప్రధాని మోదీ

గత కొంత కాలంగా ప్రధానమంత్రి మోదీ(PM Modi) సిక్కు ప్రముఖులతో, మేధావులతో భేటీ అవుతున్నారు. పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ అనంతరం తాజాగా ఆయన మరోసారి సిక్కుల బృందంతో సమావేశమయ్యారు.

గత కొంత కాలంగా ప్రధానమంత్రి మోదీ(PM Modi) సిక్కు ప్రముఖులతో, మేధావులతో భేటీ అవుతున్నారు. పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌(Poling) అనంతరం తాజాగా ఆయన మరోసారి సిక్కుల బృందంతో సమావేశమయ్యారు. సిక్కుల అభ్యున్నతికి భాజపా(BJP) ప్రభుత్వం చేస్తున్న చర్యలను మోదీ సిక్కుల బృందానికి వివరించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం సిక్కు ప్రముఖులు, మేధావుల బృందంతో సమావేశమయ్యారు. సిక్కులతో తనకున్న అనుబంధం గురించి, వారి కోసం కేంద్రంలోని భాజపా ప్రభుత్వం(BJP Government) చేసిన కృషి గురించి మోదీ మాట్లాడారు. ప్రధాని నివాసంలో దాదాపు 90 నిమిషాలకు పైగా సిక్కులతో ప్రధాని సమావేశం జరిగిందని సిక్కుల బృందంతో పాటు వచ్చిన పంజాబ్‌కు చెందిన బీజేపీ నేత మంజీందర్ సింగ్ సిర్సా తెలిపారు.

సిక్కులకు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే తనను సంప్రదించాలని కూడా మోదీ సిక్కు బృంద సభ్యులకు సూచించినట్లు చెప్పారు. అనేక సంవత్సరాలుగా సిక్కుల అభ్యున్నతికి చేపట్టిన చర్యలు, సిక్కులకు సంబంధించిన పనులతో సంబంధం కలిగి ఉండటం అదృష్టంగా భావిస్తున్నట్లు ప్రధాని మోదీ సమావేశంలో చెప్పారు. సిక్కుల బృందంలోని సభ్యులలో పాటియాలా, జగత్ గురునానక్ దేవ్ విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్స్‌లర్‌ కరమ్‌జిత్ సింగ్, ఎయిర్ మార్షల్ (రిటైర్డ్) పరమజిత్ సింగ్ భంగు, గురునానక్ దేవ్ విశ్వవిద్యాలయం (అమృతసర్) వైస్‌ఛాన్స్‌లర్‌ జస్పాల్ సింగ్ సంధు, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ఛైర్మన్‌ చరణ్ సింగ్ ఉన్నారని బీజేపీ నేత మంజీందర్ సింగ్ సిర్సా తెలిపారు.

Yogi Adityanath: రెండోసారి యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణం.. హాజరైన ప్రధాని మోదీ


పంజాబ్‌ శాసనసభ ఎన్నికల పోలింగ్‌ ముందు కూడా భేటీ

పంజాబ్‌ శాసనసభ ఎన్నికల పోలింగ్‌కు రెండు రోజుల ముందు కూడా సిక్కు ప్రముఖులకు నరేంద్ర మోదీ తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చారు. దిల్లీ లోక్‌కల్యాణ్‌ మార్గ్‌లోని మోదీ నివాసంలో సమావేశం జరిగింది. సిక్కు వర్గాల సంక్షేమం కోసం భాజపా ప్రభుత్వం చేపట్టిన వివిధ చర్యలను వారికి ప్రధాని వివరించారు. ఈ సందర్భంగా మోదీ చేసిన ట్వీట్‌లో..‘సిక్కుల సంస్కృతి, సమాజానికి ఎంతో సేవ చేస్తున్న వీరంతా కేంద్రం చేస్తున్న సేవలను గుర్తించి అభినందనపూర్వకంగా మాట్లాడారు. వారి ఆశీర్వాదాలు పొందడం నేను గౌరవంగా భావిస్తా’ అని పేర్కొన్నారు. ఈ భేటీపై పంజాబ్‌ భాజపా నేత మన్‌జిందర్‌ సింగ్‌ సిర్సా మాట్లాడుతూ..‘దేశ విభజన సమయంలో కర్తార్‌పూర్‌ సాహిబ్‌ వంటి సిక్కుల పవిత్ర స్థలాలను భారత్‌లో కలపకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వాలు తప్పు చేశాయని మోదీ వారికి వివరించారు.’ అని పేర్కొన్నారు.

ఈ కుర్రాడు రియల్ స్టూడెంట్ నం.1.. ఇతడి గురించి తెలుసుకుంటే.. మీరు కూడా ఇదే అంటారు

ఈ భేటీలో దిల్లీ గురుద్వారా కమిటీ అధ్యక్షుడు హర్మీత్‌సింగ్‌ కల్కా, పద్మశ్రీ అవార్డు గ్రహీత బాబా బల్బీర్‌సింగ్‌ సీచెవాల్‌, మహంత్‌ కరమ్‌జిత్‌ సింగ్‌, బాబా జోగాసింగ్‌, జతేదార్‌ బాబా సాహిబ్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు. సిక్కుల గురుద్వారాల్లో నిర్వహిస్తున్న లంగర్లపై జీఎస్టీ తొలగింపు, 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లపై సిట్‌ ఏర్పాటు వంటి కేంద్ర ప్రభుత్వ చర్యలను సంతృప్తిని మోదీకి తెలియజేసినట్లు సిక్కు ప్రముఖులు చెప్పారు. ఈ సందర్భంగా మోదీకి సిక్కుల పవిత్రమైన ఖడ్గం అందజేశారు.
Published by:Veera Babu
First published:

Tags: Pm modi, PM Narendra Modi, Punjab

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు