Home /News /national /

PM NARENDRA MODI MEETS HIS MOTHER HEERABEN MODI IN GANDHINAGAR AND TAKES BLESSINGS PVN

Modi : ఢిల్లీకి రాజైనా అమ్మకు కొడుకే..అఖండ విజయం తర్వాత అమ్మ ఆశీర్వాదం తీసుకున్న మోడీ

తల్లి ఆశీర్వాదం తీసుకుంటున్న మోడీ

తల్లి ఆశీర్వాదం తీసుకుంటున్న మోడీ

Modi Gujarat Tour :అహ్మదాబాద్ లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం శుక్రవారం రాత్రి గాంధీ నగర్ శివారులోని రైసిన్ లో తన సోదరుడు పంకజ్ మోడీ నివాసానికి ప్రధాని వెళ్లారు. అక్కడ ఉన్న తన తల్లి హీరాబెన్ పాదాలకు నమస్కరించి ఆమె ఆశిస్సులు తీసుకున్నారు. తల్లితో కలిసి భోజనం చేశారు.

ఇంకా చదవండి ...
తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో..నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ అఖండ విజయం తర్వాత ప్రధాని మోడీ రెండు రోజుల సొంత రాష్ట్రం గుజరాత్​ పర్యటనకు వెళ్లారు. రెండు రోజుల గుజరాత్‌ పర్యటలో భాగంగా శుక్రవారం అహ్మదాబాద్‌ విమానాశ్రయం చేరుకున్న ప్రధానికి బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అహ్మదాబాద్‌ ఎయిర్‌ పోర్టు నుంచి బీజేపీ కార్యాలయం వరకు సుమారు 10 కిలోమీటర్లు నిర్వహించిన రోడ్‌ షోలో లక్షలాది మంది కార్యకర్తలు పాల్గొని మోదీకి అభివాదం చేశారు. జై మోడీ, జై..జై మోడీ అన్న నినాదాలతో రహదారులు మోగిపోయాయి. పెన్‌ టాప్‌ వాహనంలో ప్రయాణిస్తూ దారి పొడవునా ప్రజలకు, కార్యకర్తలకు చేతులు ఊపుతూ మోడీ అభివాదం తెలిపారు.

అనంతరం జీఎండీసీ గ్రౌండ్‌ లో నిర్వహించిన మహా పంచాయత్‌ సమ్మేళనం... మారు గ్రామ్‌ మారు గుజరాత్‌ కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. కొత్తగా ఎన్నికైన లక్షా 38వేల మంది స్థానిక సంస్థల ప్రతినిధులను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ఇవే కాకుండా పలు సంస్కృతిక కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొన్నారు. అహ్మదాబాద్ లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం శుక్రవారం రాత్రి గాంధీ నగర్ శివారులోని రైసిన్ లో తన సోదరుడు పంకజ్ మోడీ నివాసానికి ప్రధాని వెళ్లారు. అక్కడ ఉన్న తన తల్లి హీరాబెన్ పాదాలకు నమస్కరించి ఆమె ఆశిస్సులు తీసుకున్నారు. తల్లితో కలిసి భోజనం చేశారు.


ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, గతంలో కూడా మోడీ చాలాసార్లు ఇలా తల్లికి పాదాభివందనం చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టాయి. కాగా, ఈ ఏడాది చివరన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ కార్యాలయంలో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో భేటి అయి.. నేతలకు మోడీ తన గుజరాత్ పర్యటనలో దిశానిర్దేశం చేయనున్నారు
Published by:Venkaiah Naidu
First published:

Tags: Gujarat, Pm modi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు