PM NARENDRA MODI LAUNCHES BLOCKCHAIN BASED DIGITAL DEGREES AT IIT KANPURS 54TH CONVOCATION GH VB
Narendra Modi: ప్రారంభమైన ఐఐటీ కాన్పూర్ 54వ కాన్వొకేషన్ సెర్మనీ.. పాల్గొన్న ప్రధాని మోదీ ఏం మాట్లాడారంటే..
సెర్మనీలో పాల్గొన్న ప్రధాని మోదీ
Narendra Modi: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అంటే డిసెంబర్ 28న ఐఐటీ కాన్పూర్ (IIT-Kanpur) 54వ కాన్వొకేషన్ (Convocation) సెర్మనీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్లాక్‌చెయిన్ ఆధారిత ఎడ్యుకేషనల్ డిగ్రీలను డిజిటల్ రూపంలో ప్రధానం చేశారు.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అంటే డిసెంబర్ 28న ఐఐటీ కాన్పూర్ (IIT-Kanpur) 54వ కాన్వొకేషన్ (Convocation) సెర్మనీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్లాక్‌చెయిన్ ఆధారిత ఎడ్యుకేషనల్ డిగ్రీలను డిజిటల్(Digital) రూపంలో ప్రధానం చేశారు. దీనికి సంబంధించిన ఓ బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని మోదీ ప్రారంభించారు. నేషనల్ బ్లాక్‌చెయిన్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఐఐటీ కాన్పూర్ (IIT Kanpur) సంస్థ ఈ బ్లాక్‌చెయిన్ ఆధారిత టెక్నాలజీని సొంతంగా అభివృద్ధి చేసింది. మోదీ లాంచ్ చేసిన ఈ టెక్నాలజీ ద్వారా విద్యార్థులకు డిజిటల్ డిగ్రీలు ప్రధానం చేశారు. ఈ డిజిటల్ డిగ్రీలను ప్రపంచవ్యాప్తంగా వెరిఫై చేయవచ్చు. అలాగే ఈ డిగ్రీలకు నకిలీలు సృష్టించడం అనేది అసాధ్యం.
పట్టప్రదానోత్సవం సందర్భంగా మోదీ ఐఐటీ కాన్పూర్, విద్యార్థులను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "కాన్పూర్‌కు రెట్టింపు సంతోషమిచ్చే రోజిది. ఈ రోజున ఒకవైపు కాన్పూర్‌కు మెట్రో రైలు సౌకర్యం లభిస్తోంది. మరోవైపు వరల్డ్ టెక్నాలజీకి ఐఐటీ కాన్పూర్ నుంచి వెలకట్టలేని బహుమతులు లభిస్తున్నాయి” అని ప్రధాని మోదీ అన్నారు. తాజాగా ఐఐటీ నుంచి బ్లాక్‌చెయిన్ లో పట్టభద్రులైన విద్యార్థులందరూ దేశాన్ని, ప్రపంచాన్ని మార్చేస్తారని మోదీ వ్యాఖ్యానించారు. ఇక ఇదే రోజున కాన్పూర్ మెట్రో రైలు ప్రాజెక్ట్‌లో పూర్తయిన విభాగాన్ని మోదీ ప్రారంభించనున్నారు.
“మీరు ఐఐటీ సంస్థలో అడుగు పెట్టిన క్షణం నుంచి మీలో ఒక భారీ మార్పును కచ్చితంగా అనుభవిస్తూనే ఉంటారు. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీలో ఏదో ఒక తెలియని భయం ఉండే ఉంటుంది. కానీ ఐఐటీ కాన్పూర్ మీలోని తెలియని భయాలను తొలగించేసింది. ఇప్పుడది మీకు భారీ కాన్వాస్‌ను అందించింది. ” అని కాన్వొకేషన్లో ప్రధాని మోదీ అన్నారు.
Prime Minister @narendramodi launches blockchain-based digital degrees at the 54th Convocation of @IITKanpur
విద్యార్థులు ఐఐటీలో తీసుకున్న ట్రైనింగ్.. నేర్చుకున్న స్కిల్స్, నాలెడ్జ్ ప్రాక్టికల్ గోల్స్ సాధించడంలో కచ్చితంగా సహాయపడతాయని ప్రధాని అభిప్రాయపడ్డారు. "మీరు ఇక్కడ అభివృద్ధి చేసుకున్న వ్యక్తిత్వం సామాజిక అభివృద్ధిలో మహోన్నత పాత్ర పోషించడానికి మీకు శక్తిని ఇస్తుంది. మీ మానసిక వికాసం దేశాన్ని బలోపేతం చేస్తుంది" అని మోదీ చెబుతూ విద్యార్థుల్లో ఉత్సాహం నింపారు.
ప్రధాని మోదీ దేశంలోని స్టార్టప్ సంస్కృతి గురించి మాట్లాడుతూ.. “గత 7 ఏళ్లలో స్టార్టప్ ఇండియా, స్టాండ్ అప్ ఇండియా వంటి పథకాలు ప్రారంభించాం. అటల్ ఇన్నోవేషన్ మిషన్, పీఎం రీసెర్చ్ స్కాలర్షిప్ వంటి ప్రోగ్రాములతో భారత యువతకు కొత్త అవకాశాలకు మార్గం సుగమం చేస్తున్నాం." అని వివరించారు.
విద్యార్థులు ప్రజలతో మమేకం కావాలని ప్రధాని కోరారు. విద్యార్థులు తప్పనిసరిగా కోడింగ్ కొనసాగించాలని.. కానీ ప్రజలతో కూడా కలిసిపోతూ ఉండాలని.. విభిన్న నేపథ్యాల వ్యక్తులతో మాట్లాడితేనే విద్యార్థుల వ్యక్తిత్వం మెరుగుపడుతుందని మోదీ విశదీకరించారు.
అలాగే ఇదే కాన్వొకేషన్ వేడుకలో ఆయన నూతన విద్యా విధానం గురించి మాట్లాడారు. "మనం నెక్స్ట్ జనరేషన్ విద్యార్థులను భవిష్యత్ పోటీ ప్రపంచానికి అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వాల్యూ కూడా మెరుగుపడింది. పాలసీ అడ్డంకులు తొలగిపోయాయి. త్వరలోనే మెరుగైన ఫలితాలను మనమందరం చూడబోతున్నాం" అని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.