హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Noida Airport: నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్రమోదీ

Noida Airport: నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్రమోదీ

నోయిడా విమానాశ్రయానికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ

నోయిడా విమానాశ్రయానికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ

Noida Airport: మెరుగైన రోడ్లు, మెరుగైన రైలు నెట్‌వర్క్, మెరుగైన విమానాశ్రయాలు కేవలం ప్రాజెక్టులు మాత్రమే కాదని.. అవి మొత్తం ప్రాంతం రూపురేఖలనే మార్చేస్తాయని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు.

  ఉత్తరప్రదేశ్‌లోని జేవార్‌లో కొత్తగా నిర్మించనున్న నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధాని నరేంద్రమోదీ (PM Narendra Modi)  శంకుస్థాపన చేశారు. దీని ద్వారా ఢిల్లీ-ఎన్‌సిఆర్, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని కోట్లాది మందికి ప్రయోజనం కలుగుతుందని ఆయన తెలిపారు. ఇది ప్రపంచస్థాయిలో ఉంటుందని అన్నారు. మెరుగైన రోడ్లు, మెరుగైన రైలు నెట్‌వర్క్, మెరుగైన విమానాశ్రయాలు కేవలం ప్రాజెక్టులు మాత్రమే కాదని.. అవి మొత్తం ప్రాంతం రూపురేఖలనే మార్చేస్తాయని మోదీ తెలిపారు. ప్రజల జీవితాలను పూర్తిగా మారుస్తాయని అన్నారు. త్వరలో ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

  ఇది ఉత్తర భారతదేశానికి లాజిస్టిక్స్ గేట్‌వే అని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అభివర్ణించింది. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో(Uttar Pradesh) తిరిగి అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీ (BJP) ప్రభుత్వం చేసిన వాగ్దానాలలో విమానాశ్రయం ఒకటి. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందు 2024 నాటికి పూర్తి చేస్తామని సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. విమానాశ్రయం 1300 హెక్టార్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించి ఉందని.. ఇది అందుబాటులోకి వచ్చిన మొదటి సంవత్సరానికి 1.2 కోట్ల మంది ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని అన్నారు. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం రాష్ట్రానికి గేమ్ ఛేంజర్‌గా మారుతుందని పేర్కొంది.

  ఈ ప్రాజెక్ట్ మొత్తం యూపీకి, ముఖ్యంగా గౌతమ్ బుద్ నగర్, బులంద్‌షహర్, అలీఘర్, హాపూర్ మరియు ఇతర పరిసర ప్రాంతాలకు ప్రయోజనం చేకూరుస్తుందని వెల్లడించారు. ఈ విమానాశ్రయాన్ని యమునా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ (YIAPL) అభివృద్ధి చేయనుంది., ఇది ప్రాజెక్ట్ యొక్క స్విస్ రాయితీదారు జ్యూరిచ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ AG యొక్క 100 శాతం అనుబంధ సంస్థ. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, భారత ప్రభుత్వంతో సన్నిహిత భాగస్వామ్యంతో విమానాశ్రయం PPP నమూనాలో అభివృద్ధి చేయబడుతోంది.

  Lizards: బల్లులతో ప్రమాదం.. వాటిని ఇంట్లో నుంచి తరిమేయండి ఇలా..

  Walking: వాకింగ్ చేయడం ఆరోగ్యానికి ఎంతో మేలు.. అదే సమయంలో ఈ విషయాలు గుర్తుంచుకోండి

  కీలక పదవి ఆ ముగ్గురిలో ఎవరికి ? KCR మనసులో ఉన్నదెవరు..? ట్విస్ట్ ఉంటుందా ?

  Banana: అరటిపండ్లు తినడం వల్ల బరువు పెరుగుతాయా ?.. ఇందులో నిజమెంత ?

  ఈ విమానాశ్రయ నిర్మాణం పూర్తయితే, తూర్పు ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, గ్రేటర్ నోయిడా, మీరట్ మరియు సమీపంలోని పశ్చిమ UP జిల్లాల నివాసితులకు ప్రయాణాన్ని సులభతరం కానుంది. ఈ విమానాశ్రయం హర్యానాలోని బల్లభ్‌గఢ్ సమీపంలో ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేకి అనుసంధానం చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న ఢిల్లీ విమానాశ్రయానికి దూరంగా నివసించే హర్యానా మొత్తం జనాభాకు నేరుగా విమాన కనెక్టివిటీ లభిస్తుంది. ఇది పశ్చిమ యూపీ మాత్రమే కాకుండా ఢిల్లీ, హర్యానా. రాజస్థాన్‌లకు కూడా కొత్త కిటికీలను తెరుస్తుందని జేవార్ ఎమ్మెల్యే ధీరేంద్ర సింగ్ అన్నారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Delhi, Noida, Uttar pradesh

  ఉత్తమ కథలు