దేశ వ్యాప్తంగా కరోనా కేసులు (Corona Cases) పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ కొత్త నిర్ణయం తీసుకోబోతున్నారా?.. ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టుగా కొనసాగుతున్న పథకాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేస్తారా.. ఢిల్లీ మీడియా సర్కిల్లో ఇప్పుడు ఈ అంశం చక్కర్లు కొడుతుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) తన రాబోయే గణతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రత్యీక అంశాన్ని ప్రస్తావించనున్నారని సమాచారం. అదే ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (Ayushman Bharat Digital Mission) దేశ ప్రజలకు ఆరోగ్య ఖాతాలను రూపొందించడమే లక్ష్యంగా మోదీ తాజా నిర్ణయం తీసుకున్నారు. వీటిని డిజిటల్ హెల్త్ కార్డ్ అంటారు. అంటే ఆధార్‌లానే ప్రతీ పౌరిడికి ఒక డిజిటల్ హెల్త్ కార్డ్ ఉంటుంది. ఈ డిజిటల్ హెల్త్ కార్డు ద్వారా 14-అంకెల ఆరోగ్య గుర్తింపు (ID) నంబర్‌ను పొందుతారు. దీని ద్వారా వ్యక్తి ఆరోగ్య సమాచారాన్ని పొందు పరుస్తారు. ఈ పథకం ఇప్పటికే ఆగస్టు 15, 2020న పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు.
PM Modi: ఆలయ సిబ్బందికి 100 జతల జ్యూట్ పాదరక్షలు పంపిన ప్రధాని మోదీ
2020లో ప్రారంభించినప్పటి నుం చి ఇప్పటి వరకు దాదాపు 15 కోట్ల ఆరోగ్య IDలు సృష్టించబడ్డాయి. దాదాపు 7,400 మంది వైద్యులతో పాటు 15,000 కంటే ఎక్కువ ఆరోగ్య సౌకర్యాలు ఈ పథకంలో నమోదు చేయబడ్డాయి. 2 లక్షలకు పైగా హెల్త్ రికార్డ్ యాప్‌లు డౌన్లోడ్ చేయబడ్డాయి, ప్రభుత్వ డేటా చూపిస్తుంది.
కార్డు ద్వారా లాభాలు..
దేశంలో ప్రతీ పౌరుడికి ప్ వ్యక్తిగత ఆరోగ్య ID, వైద్యులు, ఆరోగ్య సౌకర్యాలు, వ్యక్తిగత రికార్డుల కోసం ఐడెంటిఫైయర్‌లతో కూడిన డిజిటల్ హెల్త్ ఎకోసిస్టమ్‌ను సృష్టిస్తుంది. దీని ద్వారా ప్రతీ ఒక్కరి వైద్య రికార్డు అందుబాటులో ఉంటుంది. అందించాల్సిన వైద్య వివరాలు చికిత్స వేగంగా అందించే సమాచారం అందుబాటులో ఉంటుంది.
అయితే ఈ స్కీమ్ (Scheme) స్వచ్ఛందంగా అమలు చేసే యోచనలో ఉంది. ఇష్టమున్న వారు ఈ కార్డును పొందేలా రూపొందించనున్నట్టు సమచారం. ఆరోగ్య కార్డును ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ లేదా మొబైల్ నంబర్ ఉపయోగించి పొందేలా చూస్తున్నట్టు సమాచారం.
దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో కరోనా వైరస్ స్వైరవిహారం చేస్తోంది. పార్లమెంట్ సిబ్బంది నుంచి పోలీసుల దాకా వేల సంఖ్యలో సిబ్బంది కరోనా కాటుకు గురవుతున్నారు. కొత్త కేసులు వెల్లువలా వస్తుండటంతో ఢిల్లీ దాదాపు లాక్ డౌన్ దిశగా పయనిస్తోంది. ఒక్క ఢిల్లీలోనే కాదు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు వీకెండ్ కర్ఫ్యూ పెట్టాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాని డిజిటల్ హెల్త్ కార్డును దేశ వ్యాప్తంగా ప్రవేశ పెట్టడం మేలు చేస్తుందని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona cases, Health, Narendra modi, Pm modi, PM Narendra Modi