Home /News /national /

PM NARENDRA MODI IS LOOKING FORWARD TO PROGRAMME OF PARIKSHA PE CHARCHA 2022 WHICH IS GOING TO BE HELD ON APRIL 1 AK

Pariksha Pe Charcha 2022: పరీక్షా పే చర్చ కోసం ఎదురుచూస్తున్నా.. వారి ఉత్సాహం అద్భుతమన్న ప్రధాని మోదీ

విద్యార్థులతో ప్రధాని మోదీ ముఖాముఖి (ఫైల్ ఫోటో)

విద్యార్థులతో ప్రధాని మోదీ ముఖాముఖి (ఫైల్ ఫోటో)

Pariksha Pe Charcha: ప్రధాని మోదీ గతంలో నిర్వహించిన పరీక్షా పే చర్చ 1వ ఎడిషన్ 16 ఫిబ్రవరి 2018న జరిగింది. 2వ ఎడిషన్ 29 జనవరి 2019, 3వ ఎడిషన్ 20 జనవరి 2020న జరిగింది. కోవిడ్ 19 మహమ్మారి కారణంగా 4వ ఎడిషన్ ఆన్‌లైన్‌లో 7 ఏప్రిల్ 2021న నిర్వహించబడింది.

ఇంకా చదవండి ...
    ‘పరీక్ష పే చర్చ’ పట్ల విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఉన్న ఉత్సాహం అద్భుతమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఇందుకు సంబంధించిన రాబోయే సెషన్ ప్రధాని ట్విట్టర్‌లో ప్రస్తావించారు. ఈ సంవత్సరం పరీక్షా పే చర్చ పట్ల ఉన్న ఉత్సాహం అసాధారణమైనదని ఆయన అన్నారు. లక్షల మంది ప్రజలు తమ విలువైన అనుభవాలను పంచుకున్నారని పేర్కొన్నారు. ఇందుకు సహకరించిన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలని ప్రధాని(PM Modi) తెలిపారు. ఏప్రిల్ 1న జరగనున్న ఈ కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్నానని ట్వీట్‌లో తెలిపారు. 2022 ఏప్రిల్ 1వ తేదీన జరిగే 5వ పరీక్షా పే చర్చా  (Pariksha Pe Charcha) సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో ప్రధాని మోదీ చెప్పే సూచన కోసం ఎదురుచూస్తున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. పరీక్షా పే చర్చ లైవ్ ప్రోగ్రామ్‌లో విద్యార్థులు(Students) అడిగే ప్రశ్నలు, సంబంధిత రంగాలకు సంబంధించిన ప్రశ్నలకు ప్రధాని ప్రతిస్పందిస్తారని అన్నారు.

    కరోనా నుంచి దేశం బయటపడటం, పరీక్షలు ఆఫ్‌లైన్ మోడ్‌కు మారుతున్న నేపథ్యంలో ఈ సంవత్సరం పరీక్షా పే చర్చ ప్రాముఖ్యతను సంతరించుకుందని ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యానించారు. 21వ శతాబ్దపు విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థను నిర్మించడంలో ఇలాంటి కార్యక్రమాల ప్రాముఖ్యత ఎంతో ఉందని అన్నారు. పరీక్షా పే చర్చ ఒక అధికారిక సంస్థగా మారుతోందని, దీని ద్వారా ప్రధాన మంత్రి విద్యార్థులతో నేరుగా సంభాషించారని తెలిపారు. రాష్ట్ర గవర్నర్ల సమక్షంలో జరిగే కార్యక్రమాన్ని వీక్షించేందుకు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన విద్యార్థులు కూడా రాజ్‌భవన్‌లను సందర్శిస్తారని తెలియజేశారు. దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విద్యార్థులు, ఉపాధ్యాయులు తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని సామూహిక ఉద్యమంగా మార్చేందుకు, విద్యార్థులకు ఒత్తిడి లేని పరీక్షలు నిర్వహించేందుకు మీడియా సహకారం అందించాలని పిలుపునిచ్చారు.

    యువకులకు ఒత్తిడి లేని వాతావరణాన్ని కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ‘ఎగ్జామ్ వారియర్స్’ అనే పెద్ద ఉద్యమంలో పరీక్షా పే చర్చా భాగమని మంత్రి ప్రధాన్ అన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకురావడానికి ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రయత్నాల ద్వారా మెరుగైన ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.



    పరీక్షా పే చర్చ 5వ ఎడిషన్ న్యూ ఢిల్లీలో ఏప్రిల్ 1 ఉదయం 11 గంటలకు తల్కతోరా స్టేడియం నుండి టౌన్ హాల్ ఇంటరాక్టివ్ ఫార్మాట్‌లో జరుగుతుందని మంత్రి తెలియజేశారు. భారతదేశం, విదేశాల నుండి కోట్లాది మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొంటారని ఆయన తెలిపారు.

    ప్రధాన మంత్రికి ప్రశ్నలు అడిగే విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను రచనల పోటీ ఆధారంగా షార్ట్-లిస్ట్ చేశారని కేంద్రమంత్రి తెలిపారు. ఈ పోటీ 28 డిసెంబర్ 2021 నుండి 3 ఫిబ్రవరి, 2022 వరకు MyGov ప్లాట్‌ఫారమ్ ద్వారా నిర్వహించబడిందని.. ఈ పోటీకి ఈ ఏడాది 15.7 లక్షల మంది పాల్గొనడంపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.

    బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక వ్యాఖ్యలు.. మనసులో మాట చెప్పకనే చెప్పిన జెడీయూ నేత..

    DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్.. డీఏ పెంపు.. అప్పటి నుంచి అమలు

    ప్రధాని మోదీ గతంలో నిర్వహించిన పరీక్షా పే చర్చ 1వ ఎడిషన్ 16 ఫిబ్రవరి 2018న జరిగింది. 2వ ఎడిషన్ 29 జనవరి 2019, 3వ ఎడిషన్ 20 జనవరి 2020న జరిగింది. కోవిడ్ 19 మహమ్మారి కారణంగా 4వ ఎడిషన్ ఆన్‌లైన్‌లో 7 ఏప్రిల్ 2021న నిర్వహించబడింది. ఈ కార్యక్రమం ఈవెంట్ దూరదర్శన్ రేడియో ఛానెల్‌లు, టీవీ ఛానెల్‌లు, EduMinofIndia యొక్క యూట్యూబ్ ఛానెల్‌లు, narendramodi, pmoindia, pibindia, దూరదర్శన్ నేషనల్, MyGovIndia, DDNews, రాజ్యసభ టీవీ, స్వయం సహా డిజిటల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Pariksha Pe Charcha, PM Narendra Modi

    తదుపరి వార్తలు