Home /News /national /

PM NARENDRA MODI INTERESTING COMMENTS IN TELANGANA STATE IN LOKSABHA AND SLAMS CONGRESS SK

Narendra Modi: తెలంగాణపై పార్లమెంట్‌లో ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌పై కన్నెర్ర

ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ

Narendra Modi: రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చామని..కానీ వాటిని కూడా అడ్డుకుంటున్నారని ప్రధాని మోదీ విమర్శించారు. రైతుల కష్టాలు తెలియని మీ లాంటి వారికి.. రైతుల ముసుగులో రాజకీయాలు చేసే హక్కులేదని ధ్వజమెత్తారు.

ఇంకా చదవండి ...
  పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై (PM Narendra Modi slams congress) విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదని తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోశారు. లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు. అంతకు ముందు కాంగ్రెస్ ఎంపీలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కర్నాటకలో దుమారం రేపుతున్న హిజాబ్‌ వివాదంపై మాట్లాడాలని డిమాండ్ చేశారు. మన దేశం ఎటుపోతోందని.. హిజాబ్ ధరించే స్వేచ్ఛ కూడా లేదాా? అని ప్రశ్నించారు. వారి విమర్శలకు ప్రధాని మోదీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసం కోల్పోయిందని.. ప్రతి ఎన్నికల్లో ఓడిపోతున్నా వారి అహంకారం తగ్గలేదని తీవ్ర విమర్శలు గుప్పించారు.

  ''నాగాలాండ్‌లో కాంగ్రెస్ పార్టీ 24 ఏళ్ల క్రితం గెలిచింది. ఒడిశాలో 27 ఏళ్ల క్రితం, గోవాలో 28 ఏళ్ల క్రితం అధికారంలో ఉంది. 1988లో త్రిపుర ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టారు. 1972లో పశ్చిమ బెంగాల్ ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించారు. కానీ ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు. తెలంగాణను తామే ఏర్పాటు చేశామని క్రెడిట్ తీసుకున్నారు. కానీ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను విశ్వసించలేదు. బీజేపీ హయాంలో పేద ప్రజలకు గ్యాస్, ఇళ్లు, టాయిలెట్స్ వంటి మౌలిక వసతులను పొందారు. సొంతంగా బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉన్నారు.కానీ కొందరు విపక్ష నేతలు మాత్రం ఇంకా 2014 వద్దే ఆగిపోయారు.'' అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.  Assaduddin Owaisi ప్రాణాలకు ముప్పు.. సెక్యూరిటీ వద్దంటే ఎలా?: Amit Shah అభ్యర్థన

  ''కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వలస కార్మికులకు ముంబై నుంచి ఉచిత రైలు టికెట్ ఇచ్చాయి. ఢిల్లీ ప్రభుత్వం కూడా ఉచిత బస్సులను ఏర్పాటు చేసి వలస కార్మికులను తరలించాయి. వారి వల్లే పంజాబ్, యూపీ, ఉత్తరప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి తీవ్రంగా పెరిగింది.'' అంటూ కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ దుమ్మెత్తిపోశారు.  ''మీరు నన్ను విమర్శించవచ్చు. అంతేగానీ ఫిట్ ఇండియా వంటి ప్రభుత్వ పథకాలను ఎందుకు విమర్శిస్తున్నారు. ప్రజలు మిమ్మల్ని నమ్మడం లేదు. అందుకే చాలా రాష్ట్రాల్లో దశాబ్ధాలుగా అధికారంలోకి రావడం లేదు. వచ్చే వంద ఏళ్లలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు. మీ బుద్ధి అలా ఉంది.'' అని కాంగ్రెస్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు ప్రధాని మోదీ.  Security Breach : రాహుల్ పర్యటనలో భద్రతా లోపం..ఆ రాష్ట్రంలోనే

  వోకల్ ఫర్ లోకల్ నినాదం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్లు విమర్శిస్తారా? అని మండిపడ్డారు ప్రధాని మోదీ. భారత్‌ను ఆత్మనిర్భర్‌గా మార్చడంగా మీకు ఇష్టం లేదా? మహాత్మా గాంధీ కలలను సాకారం చేయడం నచ్చడం లేదా? చిన్న రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చామని..కానీ వాటిని కూడా అడ్డుకుంటున్నారని ఆయన విమర్శించారు. రైతుల కష్టాలు తెలియని మీ లాంటి వారికి.. రైతుల ముసుగులో రాజకీయాలు చేసే హక్కులేదని ధ్వజమెత్తారు ప్రధాని.  అంతకముందు లతా మంగేష్కర్ మృతి గురించి కూడా ప్రధాని మోదీ మాట్లాడారు. ఆమె మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని.. యావత్ జాతిని ఒక్కటిగా చేసి ముందుకు కదిలించిన గొప్ప వ్యక్తి అని ఆయన కొనియాడారు.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Parliament, PM Narendra Modi, Rahul Gandhi

  తదుపరి వార్తలు