ప్రధాని మోదీ ఒక్క నిర్ణయం.. దేశానికే స్ఫూర్తి..

PM Modi SheInspiresUs | మహిళలు మరింత మందికి స్ఫూర్తిగా నిలిచేలా మోదీ తీసుకున్న నిర్ణయం.. ఎంతో మందిని ఆకట్టుకుంది.

news18-telugu
Updated: March 9, 2020, 11:31 AM IST
ప్రధాని మోదీ ఒక్క నిర్ణయం.. దేశానికే స్ఫూర్తి..
ప్రధాని మోదీ
  • Share this:
PM Modi, SheInspiresUs : సోషల్ మీడియాను వదిలేస్తున్నా.. ప్రధాని మోదీ అన్న ఈ ఒక్క మాటతో యావత్తు దేశం షాక్ అయ్యింది. ఓ విధంగా ఆయన ప్రభకు సాయపడిన సోషల్ మీడియాను వదిలేస్తున్నారేంటని అంతా ఆశ్చర్యపోయారు. కానీ.. మరుసటి రోజే తన నిర్ణయం ఏంటో సుస్పష్టంగా చెప్పారు. తాను సోషల్ మీడియాను వదిలేయడం లేదని, మహిళా దినోత్సవం రోజున తన ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ అకౌంట్ల నిర్వహణను గొప్ప మహిళల చేతికి అందజేస్తానని ప్రకటించారు. మనకు స్ఫూర్తిగా నిలుస్తున్న మహిళామణులకు వీటి నిర్వహణ అప్పగిస్తానని వెల్లడించారు. ఈ నిర్ణయాన్ని యావత్తు మహిళాలోకం శ్లాఘించింది. ఇది ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని అభిప్రాయపడింది.


మోదీయే స్వయంగా తన ట్విట్టర్ వేదికగా.. ‘మీరు పదిమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారా? లేక మీకు తెలిసిన మహిళామణులు స్ఫూర్తిగా ఉన్నారా? అయితే వారి పేర్లు నాకు పంపితే వాళ్లకు నా సోషల్ మీడియా అకౌంట్లను అప్పగిస్తా’అని ప్రకటించిన మోదీ నిర్ణయానికి భారీ స్పందనే వచ్చింది.

అన్నట్లుగానే మోదీ కూడా తన అకౌంట్లను ఏడుగురు మహిళలకు అప్పగించారు. డాక్టర్ మాళవిక నాయర్, స్నేహ మోహన్‌దాస్, అరిఫా జాన్, కల్పన రమేశ్, విజయ పవార్, కళావతి దేవీ, వీణా దేవికి తన సోషల్ మీడియా అకౌంట్లను అప్పగించారు. అంతకుముందు.. ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నారీ శక్తి సాధించిన విజయాలకు, వారి స్ఫూర్తికి నా సెల్యూట్. కొన్ని రోజుల క్రితం నేను చెప్పినట్టు ఈ రోజు మొత్తం నేను సోషల్ మీడియా అకౌంట్ల నుంచి సైన్ ఆఫ్ అవుతున్నా. అయితే, ఏడుగురు మహిళా విజేతలు తమ జీవన గమనాన్ని నా సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా మీకు తెలియజేస్తారు’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

సోషల్ మీడియా అకౌంట్లను వాళ్లకు అప్పగించగానే నెటిజన్ల నుంచి అద్భుత స్పందన వచ్చింది. యావత్తు దేశం ట్వీట్లు, కామెంట్లు, లైకులతో హోరెత్తించింది. ఈ ఏడుగురు మహిళలు తమ జీవితంలోని సవాళ్లను, విశేషాలను ఈ వేదికగా పంచుకున్నారు. మహిళలు మరింత మందికి స్ఫూర్తిగా నిలిచేలా మోదీ తీసుకున్న నిర్ణయం.. ఎంతో మందిని ఆకట్టుకుంది.
First published: March 9, 2020, 11:26 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading