Home /News /national /

PM NARENDRA MODI INAGURATES OXYGEN PLANTS WHICH BUILT WITH PM CARE FUNDS AK GH

PM CARES fund: పీఎం కేర్స్ ఫండ్‌పై విమర్శలకు ప్రధాని మోదీ చెక్.. ఆ నిధులతో నిర్మించిన ఆక్సిజన్ ప్లాంట్లు ప్రారంభం

ప్రధాని మోదీ (ఫైల్ ఫోటో)

ప్రధాని మోదీ (ఫైల్ ఫోటో)

ఉత్తరాఖండ్‌లోని ఎయిమ్స్ రిషికేశ్‌లో జరిగిన కార్యక్రమంలో 35 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో పీఎం కేర్స్ కింద ఏర్పాటు చేసిన 35 ఆక్సిజన్ ప్లాంట్లను గురువారం మోదీ ప్రారంభించారు.

భార‌త్‌లో కరోనా మహమ్మారి విజృంభించిన వేళ కేంద్ర ప్రభుత్వం పీఎం కేర్స్ (PM CARES) పేరిట అత్యవసర సహాయ నిధిని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సహాయ నిధిని ఏర్పాటు చేసిన క్షణం నుంచే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఫండ్స్‌ను స్వప్రయోజనాల కోసమే ఏర్పాటు చేశారని ప్రతిపక్ష పార్టీ నేతలు ఇష్టానుసారం వ్యాఖ్యలు చేశారు. మరికొందరు ఇది ఒక స్కామ్ అని అంటే.. ఇంకొందరు నిధులకు సంబంధించి ఆడిట్ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇలా విమర్శలు చేసిన ప్రతిపక్షాలకు గురువారం ధీటైన బదులిచ్చారు ప్రధాని మోదీ. పీఎం కేర్స్ ఫండ్ ద్వారా సేకరించిన నిధులతో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 35 ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్‌లను ఆయన ప్రారంభించారు. మాట ఇచ్చినట్టుగానే ఈ ఫండ్ నిధులను ప్రజా అవసరాల కోసం వినియోగించారు.

నిజానికి బుధవారం నాడే ఢిల్లీ, ఝార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం కేర్స్ నిధి సాయంతో నిర్మించిన బహుళ ఆక్సిజన్ ప్లాంట్లను ప్రారంభించాయి. దీంతో కేంద్ర ప్రభుత్వ వర్గం స్పందించింది. "పీఎం కేర్స్ ఫండ్ పై ముందు నుంచీ మొన్నటి వరకు విమర్శలు చేసిన ప్రతిపక్ష పార్టీలే ఇప్పుడు పీఎం కేర్ నిధులతో ఆక్సిజన్ ప్లాంట్లను ప్రారంభించి.. క్రెడిట్ మొత్తం తమకే దక్కుతుందన్నట్టు వ్యవహరిస్తున్నాయి" అని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

అక్టోబర్ 6న కొందరు ఢిల్లీ ప్రభుత్వ మంత్రులు 27 ఆక్సిజన్ ప్లాంట్లను ప్రారంభించారు. వాటిలో 14 పీఎం కేర్స్ ఫండ్ ద్వారానే నిర్మించారు. మిగిలిన వాటికి ఇతర పరిశ్రమల సంస్థలు నిధులు సమకూర్చాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు న్యూస్ 18 కి తెలిపాయి. "ఆక్సిజన్ ప్లాంట్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముందు ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనల్లో ఈ ప్లాంట్లను స్థాపించినందుకు పీఎం కేర్స్ నిధికి ఎటువంటి క్రెడిట్ ఇవ్వలేదు" అని ఒక వర్గం తెలిపింది.

ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శి కుల్జీత్ సింగ్ చాహల్ మాట్లాడుతూ.. "బుధవారం ఢిల్లీ ప్రభుత్వ మంత్రులు ప్రారంభించిన ఆక్సిజన్ ప్లాంట్లలో చాలా వరకు పీఎం కేర్స్ ఫండ్ నిధులతో నిర్మితమయ్యాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం క్రెడిట్‌ను పొందడానికి ప్రయత్నిస్తోంది" అని అన్నారు. చాహల్ ఈ ప్లాంట్లలోని కొన్నింటికి సంబంధించిన వీడియోను కూడా అందరితో పంచుకున్నారు.

ఝార్ఖండ్‌లో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, రాష్ట్ర ఆరోగ్య మంత్రి బుధవారం పీఎం కేర్స్ ఫండ్ సాయంతో నిర్మించిన 27 ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్‌లను ప్రారంభించారు. ఝార్ఖండ్ ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనలో పీఎం కేర్స్ ఫండ్ ద్వారానే ప్లాంట్లకు నిధులు అందినట్లు పేర్కొన్నారు. అయితే దేశవ్యాప్తంగా ఆక్సిజన్ ప్లాంట్లను పీఎం మోదీ ప్రారంభించే కార్యక్రమానికి ఒక రోజు ముందుగానే సీఎం ప్రారంభోత్సవం చేశారు. ఈ విషయమై రాష్ట్ర బీజేపీ జార్ఖండ్ ప్రభుత్వాన్ని విమర్శించింది.

Chiranjeevi: క్లైమాక్స్‌కు చేరుకుంటున్న మా ఎన్నికలు.. లాస్ట్ పంచ్ మెగాస్టార్‌దేనా.. ఆయన మాటలకు అర్థమేంటి ?

Fake Banking Apps: బ్యాంకింగ్ యాప్స్‌తో జరభద్రం.. ఫేక్ యాప్స్‌ను ఇలా గుర్తించండి..

ఉత్తరాఖండ్‌లోని ఎయిమ్స్ రిషికేశ్‌లో జరిగిన కార్యక్రమంలో 35 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో పీఎం కేర్స్ కింద ఏర్పాటు చేసిన 35 ఆక్సిజన్ ప్లాంట్లను గురువారం మోదీ ప్రారంభించారు. "వీటితో దేశంలోని అన్ని జిల్లాలు ఇప్పుడు పీఎస్ఎ(PSA) ఆక్సిజన్ ప్లాంట్లను ప్రారంభించాయి" అని మోదీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలిపారు.
Published by:Kishore Akkaladevi
First published:

Tags: Oxygen plants, PM Narendra Modi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు