హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

PM Narendra Modi: నాకే ప్రజాస్వామ్య పాఠాలు నేర్పిస్తారా? రాహుల్‌పై మోదీ ధ్వజం

PM Narendra Modi: నాకే ప్రజాస్వామ్య పాఠాలు నేర్పిస్తారా? రాహుల్‌పై మోదీ ధ్వజం

ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ

రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో దేశంలోని ఇతర ప్రాంతాలతో జమ్మూకాశ్మీర్‌కు కనెక్టివిటీ పెంచుతామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అంతేకాదు ప్రతి ఇంటికీ పైప్‌లైన్‌తో తాగునీటిని అందిస్తామని హామీ ఇచ్చారు.

  స్థానిక సంస్థల ఎన్నికలతో జమ్మూకాశ్మీర్‌లో ప్రజాస్వామ్య మూలాలు మరింతగా బలపడ్డాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పుదుచ్చేరిలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించలేని కాంగ్రెస్ నేతలు.. తనకు ప్రజాస్వామ్యం గురించి పాఠాలు నేర్పే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. దేశంలో ప్రజాస్వామ్యమే లేదని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు ప్రధాని మోదీ ఇలా కౌంటర్ ఇచ్చారు. శనివారంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జమ్మూకాశ్మీర్‌లో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా జమ్మూకాశ్మీర్‌లో 12 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

  '' జమ్మూకాశ్మీర్‌లో జిల్లా అభివృద్ధి మండళ్ల (డీడీసీ) ఎన్నికల ప్రశాంతంగా జరిగాయి. యువకుల నుంచి వృద్ధుల వరకు అందరూ ఓటింగ్‌లో పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలతో కాశ్మీర్‌లో ప్రజాస్వామ్యమూలాలు బలపడ్డాయి. ద్ర పాలిత ప్రాంతంగా ఏర్పడ్డ తర్వాత అతి తక్కువ కాలంలోనే అక్కడ డీడీసీ ఎన్నికలు జరిగాయి. కానీ పుదుచ్చేరిలో చాలా కాలంగా అధికారంలో ఉన్న పార్టీలు మాత్రం పంచాయతీ ఎన్నికలు జరపడం లేదు. ఆ నేతలు ఇప్పుడు నాకు ప్రజాస్వామ్యంపై పాఠాలు చెబుతున్నారు.'' అని కాంగ్రెస్ పార్టీపై నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు.

  గత కొన్ని నెలలుగా జమ్మూకాశ్మీర్‌లో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. కాశ్మీర్‌లో ఎవరైనా భూములు కొనుగోలు చేసే వీలు కల్పించారు. జేకే వ్యాప్తంగా 800 వెల్‌నెస్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఆరోగ్య బీమా తీసుకున్న లక్షలాది మందికి లబ్ధి చేకూరుతుంది. కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించిన తర్వాత జమ్మూకాశ్మీర్, లద్దాఖ్ అభివృద్ధిపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో దేశంలోని ఇతర ప్రాంతాలతో జమ్మూకాశ్మీర్‌కు కనెక్టివిటీ పెంచుతామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అంతేకాదు ప్రతి ఇంటికీ పైప్‌లైన్‌తో తాగునీటిని అందిస్తామని హామీ ఇచ్చారు.

  కాగా, జమ్మూకాశ్మీర్‌లో తొలిసారి డిస్ట్రిక్ట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (DDC) ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. మొత్తం 20 జిల్లాల్లో ఎన్నికలను నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఫరూఖ్ అబ్దుల్లా నేతృత్వంలోని గుప్కర్ కూటమి, కాంగ్రెస్ కలిపి 13 జిల్లాలను గెలిచాయి. జమ్మూలోని ఆరు జిల్లాల్లో బీజేపీ విజయం సాధించింది.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Jammu and Kashmir, PM Narendra Modi

  ఉత్తమ కథలు