49 మందిపై చర్యలు తీసుకోండి...ప్రధాని మోదీకి రక్తంతో లేఖలు

PM Narendra Modi | దేశ ప్రతిష్టను దిగజార్చేలా లేఖ రాసిన 49 మంది ప్రముఖులపై దేశ ద్రోహం కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి తమ రక్తంతో రాసిన లేఖను పంపారు.

news18-telugu
Updated: July 31, 2019, 7:07 PM IST
49 మందిపై చర్యలు తీసుకోండి...ప్రధాని మోదీకి రక్తంతో లేఖలు
నరేంద్ర మోదీ (File)
  • Share this:
దేశంలో జరుగుతున్న మూకతాడులను నిరసిస్తూ 49 మంది మేధావులు ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాయడం తెలిసిందే. ‘జై శ్రీరామ్’ నినాదాలు చేస్తూ మూకదాడులకు పాల్పడుతున్నారని, దీన్ని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవాలని వారు తమ లేఖలో కోరారు. ప్రధాని మోదీకి మేధావులు రాసిన లేఖల పట్ల పలువురు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. మేథావుల పేరిట వీరు రాసిన లేఖ అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను దిగజార్చేలా ఉందని మండిపడుతున్నారు. అలాగే జై శ్రీరామ్ నినాదాన్ని మూకదాడులకు అంటగట్టడం ఏంటని నిలదీస్తున్నారు.

తాజాగా అఖిల భారత హిందూ మహాసభకు చెందిన 101 మంది కార్యకర్తలు ప్రధాని నరేంద్ర మోదీకి తమ రక్తంతో లేఖలు రాశారు. ఇటీవల మూకదాడులకు సంబంధించి ప్రధానికి లేఖ రాసిన 49 మంది ప్రముఖులపై చర్యలు తీసుకోవాలని కోరారు. వీరందరూ కళంకితులుగా ఆరోపిస్తూ...వారిపై దేశ ద్రోహం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే వారికి గతంలో భారత ప్రభుత్వం ఇచ్చిన అవార్డులను వెనక్కి తీసుకోవాలని ప్రధాని మోదీని కోరారు.

pm modi news, 49 celebrities letter to pm modi, mob lynching, hindu mahasabha, blood letters, హిందూ మహాసభ, ప్రధాని నరేంద్ర మోదీ, రక్తంతో లేఖలు, మోదీ
ప్రధాని మోదీకి రక్తంతో రాసిన లేఖలు పంపుతున్న హిందూ మహాసభ కార్యకర్తలు


First published: July 31, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>