హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

ట్రంప్‌తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ.. ఏం చర్చించారంటే..

ట్రంప్‌తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ.. ఏం చర్చించారంటే..

డొనాల్డ్ ట్రంప్, ప్రధాని మోదీ

డొనాల్డ్ ట్రంప్, ప్రధాని మోదీ

త్వరలోనే అమెరికాలో సాధారణ పరిస్థితులు నెలకొనాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ఇక ఇండియా-చైనా సరిహద్దు వివాదం గురించి మోదీని అడిగి తెలుసుకున్నారు ట్రంప్.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ఇరుదేశాల ఎదుర్కొంటున్న సవాళ్లపై కాసేపు ముచ్చటించారు. జార్జి ఫ్లాయిడ్ హత్య తర్వాత అమెరికాలో నెలకొన్న హింసాత్మక ఘటనల గురించి ట్రంప్‌ను అడిగి తెలుసుకున్నారు మోదీ. త్వరలోనే అమెరికాలో సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆయన ఆకాంక్షించారు. ఇక ఇండియా-చైనా సరిహద్దు వివాదం గురించి మోదీని అడిగి తెలుసుకున్నారు ట్రంప్. అనంతరం అమెరికాలో జరగనున్న జీ7 సదస్సుకు ప్రధాని మోదీని అమెరికా అధ్యక్షుడు ఆహ్వానించారు. అంతేకాదు ఇరుదేశాల్లో కరోనా పరిస్థితి, ప్రపంచ ఆరోగ్య సంస్థలో తేవాల్సిన సంస్కరణల గురించి మోదీ, ట్రంప్ చర్చించారు.


First published:

Tags: America, Donald trump, India-China, Pm modi

ఉత్తమ కథలు