ఎయిర్‌పోర్టులపై కేంద్రం ఫోకస్.. పూర్తి ప్రైవేటీకరణ దిశగా ఆలోచనలు.. వాటాలు అమ్మేస్తుందా?

ఎయిర్‌పోర్టులపై కేంద్రం ఫోకస్.. పూర్తి ప్రైవేటీకరణ దిశగా ఆలోచనలు.. వాటాలు అమ్మేస్తుందా? (ప్రతీకాత్మక చిత్రం)

కేంద్ర ప్రభుత్వం అమెరికా తరహా పాలనను అమలు చేయాలనుకుంటోందా... ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వెనక్కి వెళ్లాలనుకుంటోందా... ప్రైవేటీకరణ దిశగా మరిన్ని అడుగులు పడుతున్నాయా?

 • Share this:
  మన దేశంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ఉంది. అంటే... ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగం రెండూ ఉంటాయి. అదే అమెరికాలో ప్రైవేట్ రంగం ఎక్కువగా ప్రభుత్వ జోక్యం తక్కువగా ఉంటాయి. అదే పెట్టుబడిదారీ వ్యవస్థ. కేంద్ర ప్రభుత్వం... ఈ తరహా విధానాలే ఇప్పుడు పనిచేస్తాయి అని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వాలు వ్యాపారం చేయకూడదు అని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీయే అన్నారు. తద్వారా... ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ.. వాటిలోని తమ వాటాలను కేంద్రం వెనక్కి తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు స్పష్టమవుతోంది. తాజాగా... ఎయిర్‌పోర్టులపై ఫోకస్ పెట్టిన కేంద్రం... వాటిలోని తన వాటాలను ఉపసంహరించుకోబోతున్నట్లు తెలిసింది.

  పెట్టుబడులను వెనక్కి తీసుకునే అంశంలో భాగంగా హైదరాబాద్‌ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో కేంద్ర ప్రభుత్వం తన వాటాను అమ్మేసుకోవాలనుకుంటోంది. ఎయిర్‌పోర్ట్స్ అథార్టీ ఆఫ్ ఇండియా (AAI)కి, తెలంగాణ ప్రభుత్వానికీ కలిపి... ఈ ఎయిర్‌పోర్టులో 26 శాతం వాటా ఉంది. కేంద్రం తన వాటాను అమ్మేసుకొని... డబ్బులు తీసుకోవాలనుకుంటున్నట్లు తెలిసింది. మీకు తెలుసుగా... ఇలా వాటాలు అమ్మేసుకోవడం ద్వారా కేంద్రం రూ.2.5 లక్షల కోట్లు పొందాలని టార్గెట్ పెట్టుకుంది. ఇందులో ఏప్రిల్ 1 నుంచి మొదలైన 2021-2022 ఆర్థిక సంవత్సరం... వచ్చే ఏడాది మార్చి 31 నాటికి ముగిసే లోపు రూ.1.75 లక్షల కోట్లు పొందాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా... ఛాన్స్ ఉన్న ప్రతీ దాన్నీ అమ్మేసుకుంటోంది. వాటిలో భాగంగానే ఎయిర్‌పోర్టులనూ అమ్మేయాలనుకుంటోంది.

  ఆల్రెడీ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు ఎయిర్‌పోర్టులు ప్రైవేట్ పరం అయ్యాయి. ఉన్న కొద్ది వాటాలను కూడా వదిలించుకోవాలని కేంద్రం భావిస్తోంది. త్వరలో కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. అందులో దీనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని సమాచారం. ఈ నాలుగు విమానాశ్రయాలే కాదు... 2021-22 ఆర్థిక సంవత్సరంలో మరో 13 ఎయిర్‌పోర్టులను కూడా కేంద్రం ప్రైవేటీకరణ చెయ్యాలనుకుంటోంది. ఈమధ్యే ఈ నిర్ణయం తీసుకుంది.

  ఇది కూడా చదవండి: Top 5 Budget Cars: ఇండియాలో రూ.5 లక్షల లోపు లభించే టాప్ 5 బడ్జె్ట్ కార్లు ఇవే...

  ఆల్రెడీ అదానీ గ్రూపు... గతేడాది ఇలాగే 6 ఎయిర్‌పోర్టులను సాధించుకుంది. AAI చేతిలో 100కి పైగా ఎయిర్‌పోర్టులు ఉన్నాయి. హైదరాబాద్‌, బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుల్లో తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ప్రభుత్వాలతో కలిసి AAIకి 26 శాతం చొప్పున వాటా ఉంది. అలాగే... ఢిల్లీ ఎయిర్‌పోర్టులో AAIకి 26 శాతం వాటా ఉంది. ఈ వాటాలు అమ్మేస్తే... కేంద్రానికి వేల కోట్లు వస్తాయి. అలాగే... నష్టాల్లో ఉన్నప్పుడు కేంద్రం ఆదుకోవాల్సిన భారం తప్పుతుంది. ఇలా క్రమంగా అన్ని రంగాల్లోనూ పెట్టుబడులను వెనక్కి తీసుకునేలా కేంద్రం ప్రణాళికలు వేసుకుంటోంది.
  Published by:Krishna Kumar N
  First published: