PM Modi: సొంత ఇళ్లతో లక్షాధికారులు.. సంతోషంగా ఉందన్న ప్రధాని మోదీ

ఫ్రధాని నరేంద్రమోదీ (ఫైల్ ఫోటో)

PM Modi: ఇళ్ళు పొందిన 75 వేల మంది తమ కొత్త ఇళ్ళలో దసరా, దీపావళి, ఈద్ పండుగలను ఆనందంగా జరుపుకుంటారని ప్రధాని నరేంద్రమోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ లబ్ధిదారుల్లో 80 శాతం మంది మహిళలే కావడం తనకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.

  • Share this:
    ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) కింది ఇళ్లు పొందిన తొమ్మిది లక్షల మంది లబ్ధిదారులను దీపావళి రోజున రెండు దీపాలు వెలిగించాలని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం కోరారు. PMAY పథకం క్రింద పేదల బ్యాంకు ఖాతాలకు రూ.1 లక్ష కోట్లు కేంద్ర ప్రభుత్వం జమ చేసిందని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని 75 జిల్లాల్లో 75 వేల మంది లబ్ధిదారులకు ఇళ్ళను డిజిటల్ విధానంలో ప్రధాని మోదీ అప్పగించారు. ఇళ్ళు పొందిన 75 వేల మంది తమ కొత్త ఇళ్ళలో దసరా, దీపావళి, ఈద్ పండుగలను ఆనందంగా జరుపుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ లబ్ధిదారుల్లో 80 శాతం మంది మహిళలే కావడం తనకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.

    ఉత్తరప్రదేశ్‌ను పరిపాలించిన గత ప్రభుత్వం పేదలకు ఇళ్లను నిర్మించాలని కోరుకోలేదని ప్రధాని మోదీ విమర్శించారు. 2017కి పూర్వం ఉత్తరప్రదేశ్‌లో పీఎంఏవై పథకం కింది ఇళ్ళ నిర్మాణానికి రూ.18,000 కోట్లు మంజూరుకు ఆమోదించినట్లు తెలిపారు. అయినప్పటికీ 18 ఇళ్లు కూడా కట్టలేదన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం 9 లక్షల ఇళ్ళను నిర్మించిందని కితాబిచ్చారు. మురికివాడల్లో నివసించే 3 కోట్ల కుటుంబాలు పక్కా ఇళ్ళు పొందడంతో ఒకే ఒక్క పథకంతో లక్షాధికారులయ్యారని అన్నారు.

    దేశవ్యాప్తంగా కోటి 13 లక్షల ఇళ్లు కట్టించామని.. అందులో 50 లక్షల ఇళ్లు ఇప్పటికే పేదలకు అందించామని ప్రధాని మోదీ తెలిపారు. పట్టణాల్లోనే పేదలు, మధ్యతరగతి సమస్యలు తీర్చేందుకు సీరియస్‌గా దృష్టి పెట్టామని అన్నారు. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అనేది పెద్ద ముందడుగు అని అభివర్ణించారు. ఈ చట్టం ద్వారా ఈ రంగంలో మోసాలకు అడ్డుకట్ట పడుతుందని తెలిపారు.

    Huzurabad: హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ భార్య జమున నామినేషన్.. అసలు కారణం ఇదే.. ఆమె ఆస్తుల విలువ ఎంతంటే..

    KT RamaRao: ఆ ఎమ్మెల్యేను చూసి నేర్చుకోండి.. టీఆర్ఎస్ నేతలకు కేటీఆర్ క్లాస్

    కొందరు పగలు రాత్రి తమ శక్తిని ప్రభుత్వాన్ని విమర్శించేందుకు వెచ్చిస్తున్న కొందరు.. తమ హయాంలో ఇలా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. మరికొన్ని నెలల్లోనే ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. మరోసారి ఇక్కడ అధికారం నిలపుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది బీజేపీ. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తే.. 2024 లోక్ సభ ఎన్నికల్లోనూ విజయం సాధించడం సులువు అవుతుందని బీజేపీ యోచిస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published: