కాంగ్రెస్ పార్టీ ఓ టైటానిక్.. ప్రధాని మోదీ సెటైర్లు..

కాంగ్రెస్ పార్టీ టైటానిక్ దారిలో వెళుతోంది. రాబోయే రోజుల్లో అది మునిగిపోవడం ఖాయం. కాంగ్రెస్ పడవలో ఎవరు ఎక్కినా ఎన్సీపీ లాగా మునిగిపోవడం ఖాయమన్నారు.

news18-telugu
Updated: April 6, 2019, 10:44 PM IST
కాంగ్రెస్ పార్టీ ఓ టైటానిక్.. ప్రధాని మోదీ సెటైర్లు..
ప్రధాని నరేంద్ర మోడీ
  • Share this:
125 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని టైటానిక్‌తో పోల్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మహారాష్ట్రలోని నాందేడ్‌లో‌ ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మునిగే పడవ అని చెప్పిన మోదీ.. టైటానిక్‌తో పోల్చారు. (టైటానిక్‌ 1912లో మునిగిపోయింది). ‘కాంగ్రెస్ పార్టీ టైటానిక్ దారిలో వెళుతోంది. రాబోయే రోజుల్లో అది మునిగిపోవడం ఖాయం. కాంగ్రెస్ పడవలో ఎవరు ఎక్కినా ఎన్సీపీ లాగా మునిగిపోవడం ఖాయమన్నారు.’ అని మోదీ అన్నారు. అమేథీతో పాటు వయనాడ్‌లో కూడా పోటీ చేస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మీద కూడా మోదీ సెటైర్లు వేశారు. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ప్రాంతంతో పాటు మరో నియోజకవర్గంలో కూడా రాహుల్ పోటీ చేయడంపై మోదీ విమర్శలు గుప్పించారు.రాహుల్ గాంధీ తాను గెలవడానికి మైక్రోస్కోప్‌లో వెతుక్కుని ఓ సీటు ఎంచుకున్నారని సెటైర్ వేశారు. ‘మెజారిటీ మైనారిటీ’ అయిన ప్లేస్ ఎంచుకున్నారని ఎద్దేవా చేశారు.
First published: April 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading