హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

PM Modi: 130 కోట్ల మంది భారతీయుల శుభాకాంక్షలతో వచ్చా.. సైనికులతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు

PM Modi: 130 కోట్ల మంది భారతీయుల శుభాకాంక్షలతో వచ్చా.. సైనికులతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు

సైనికులతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు (Image: PTI)

సైనికులతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు (Image: PTI)

PM Modi Diwali Celebrations With Soldiers: దేశ ప్రధానిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఆయన సైనికులతోనే దీపావళి జరుపుకుంటూ వస్తున్నారు. 2014లో ప్రధానిగా తొలిసారి సియాచిన్‌లో సైనికులతో దీపావళి జరుపుకున్న ప్రధాని మోదీ.. అప్పటి నుంచి ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.

ఇంకా చదవండి ...

మారుతున్న ప్రపంచంతో, యుద్ధ వ్యూహాలకు అనుగుణంగా సైన్యం తమ సామర్థ్యాలను మెరుగుపరుచుకోవాల్సి ఉందని ప్రధాని మోదీ (PM Narendra Modi) అన్నారు. కనెక్టివిటీతో పాటు దళాల విస్తరణ కోసం నూతన సరిహద్దు మౌలిక వసతులను అభివృద్ధి చేశామని అన్నారు. కుటుంబంతో దీపావళి జరుపుకోవాలని అనుకున్నామని.. అందుకే ఇక్కడకు వచ్చానని మోదీ తెలిపారు. జమ్మూ కశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలోని నౌషెరా సెక్టార్‌లో సైనికులతో(Jawan) కలిసి ప్రధాని మోదీ దీపావళి(Diwali 2021) వేడుకలు జరుపుకున్నారు. తాను ఇక్కడికి ప్రధానిగా రాలేదని.. 130 కోట్ల మంది భారతీయుల శుభాకాంక్షలతో వచ్చానని అన్నారు. సైనికుల ధైర్యసాహసాలను ఆయన కొనియాడారు. వారి వల్లే దేశంలో శాంతి, భద్రత ఉన్నాయని అన్నారు. రక్షణ రంగంలోని ఆత్మనిర్భర్ భారత్‌ సాకారమవుతోందని.. విదేశాలపై ఎక్కువగా ఆధారపడే పరిస్థితి తగ్గుతోందని అన్నారు. 65 శాతం రక్షణ రంగం బడ్జెట్ దేశంలోనే ఖర్చవుతోందని తోలిపారు.

కొత్తగా రక్షణ రంగానికి సంబంధించి ఏడు కంపెనీలను విజయదశమి రోజు ప్రారంభించినట్టు వెల్లడించారు. డిఫెన్స్ స్టార్టప్స్‌లో భారతీయ యువత పాలుపంచుకుంటోందని తెలిపారు. ఇది దేశ రక్షణ రంగంలో ఎగుమతులను బలోపేతం చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సర్జికల్ స్ట్రైక్స్‌లో ఇక్కడి బ్రిగేడ్ పోషించిన పాత్రను ప్రధాని మోదీ కొనియాడారు. సర్జికల్ స్ట్రైక్ తరువాత కూడా ఇక్కడ తీవ్రవాద కార్యకలాపాలు విస్తరించేందుకు ప్రయత్నాలు జరిగాయని.. అయితే వారికి ఎప్పటికప్పుడు సరైన జవాబు లభించిందని పేర్కొన్నారు.

దేశంలోని సరిహద్దులకు కనెక్టివిటీ పెరిగిందని అన్నారు. లద్దాఖ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు, జైసల్మేర్ నుంచి అండమాన్ అండ్ నికోబార్ వరకు కనెక్టివిటీ పెరిగిందని తెలిపారు. గతంలో సరిహద్దులు, సముద్ర తీరాల్లో సరైన కనెక్టివిటీ లేని పరిస్థితుల నుంచి ఇప్పుడు మంచి రోడ్లు, అప్టికల్ ఫైబర్‌తో పాటు దళాల విస్తరణ, సైనికులకు మెరుగైన సౌకర్యాల కల్పన జరిగిందని ప్రధాని మోదీ వివరించారు. రక్షణ రంగం విషయంలో గతంలో ఎక్కువగా దిగుమతుల మీద ఆధారపడే వాళ్లమని.. కానీ ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో పరిస్థితి మారిందని అన్నారు.

త్వరలోనే తెలంగాణలో మరో ఉప ఎన్నిక.. బీజేపీ ఎమ్మెల్యే జోస్యం

టీఆర్ఎస్‌కు మాత్రమే కాదు.. ఆ నేతకు కూడా ‘హుజూరాబాద్’ పెద్ద దెబ్బ.. ఇమేజ్‌కు డ్యామేజ్ ?

మన ఆర్మీ ఎంతో గొప్పదని.. కేవలం సరిహద్దుల్లో రక్షణకు పరిమితం కాకుండా ప్రకృతి వైపరిత్యాలు సంభవించిన సమయంలో ప్రజలకు సాయం చేసేందుకు సిద్ధంగా ఉంటారని అన్నారు. ఇది దేశ ప్రజలందరి దృష్టిలో సైన్యం పట్ల ఓ గొప్ప నమ్మకం ఏర్పడేలా చేసిందని వ్యాఖ్యానించారు. దేశ ప్రధానిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఆయన సైనికులతోనే దీపావళి జరుపుకుంటూ వస్తున్నారు. 2014లో ప్రధానిగా తొలిసారి సియాచిన్‌లో సైనికులతో దీపావళి జరుపుకున్న ప్రధాని మోదీ.. అప్పటి నుంచి ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.

First published:

Tags: Diwali 2021, Narendra modi, Pm modi

ఉత్తమ కథలు