దేశంలో కరోనా కేసులు తీవ్రస్థాయిలో పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిని ఏ రకంగా అధిగమించాలనే దానిపై ప్రధాని మోదీ ప్రతి రోజూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కరోనా కట్టడి కోసం దేశ ప్రజలంతా కలిసికట్టుగా ముందుకుసాగాలని ఇటీవల ప్రధాని మోదీ సందేశం కూడా ఇచ్చారు. ఇదిలా ఉంటే కరోనా పరిస్థితిపై సమీక్షలు నిర్వహించడంలో బిజీగా ఉన్న ప్రధాని నరేంద్రమోదీ.. బెంగాల్‌లో తన ఎన్నికల ప్రచార ర్యాలీలను రద్దు చేసుకున్నారు. ఇప్పటికే అనేక పర్యాయాలు బెంగాల్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రధాని మోదీ.. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లడం సరికాదనే నిర్ణయానికి వచ్చారు. ఈ కారణంగానే రేపు బెంగాల్‌లో తాను పాల్గొనాల్సిన ఎన్నికల ర్యాలీలను రద్దు చేసుకున్నారు.
ఇక రేపు ఉదయం 9 గంటలకు కరోనా పరిస్థితిపై అంతర్గత సమీక్ష చేయనున్న ప్రధాని నరేంద్రమోదీ.. ఆ తరువాత దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో 10 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ భేటీ అవుతారు.
Tomorrow, will be chairing high-level meetings to review the prevailing COVID-19 situation. Due to that, I would not be going to West Bengal.
— Narendra Modi (@narendramodi) April 22, 2021
దేశంలో మెడికల్ ఆక్సిజన్ కొరతపై ఇప్పటికే సమీక్ష నిర్వహించిన ప్రధాని రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు మరోసారి ఈ అంశంపై ఆక్సిజన్ తయారీ కంపెనీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5 State Elections, PM Narendra Modi, West Bengal Assembly Elections 2021