Home /News /national /

Vizag Gas Leak | వైజాగ్ ఘటనపై ప్రధాని మోదీ కీలక సమావేశం

Vizag Gas Leak | వైజాగ్ ఘటనపై ప్రధాని మోదీ కీలక సమావేశం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Vizag Gas Leak | ఈ ఘటనపై కేంద్ర హోంశాఖతో పాటు ఎన్‌డీఏమ్ఏ అధికారులను ఆరా తీసిన ప్రధాని నరేంద్రమోదీ... ప్రధాని నుంచి ప్రతి ఒక్కరూ సురక్షితంగా బయటపడాలని ఆకాంక్షించారు.

    వైజాగ్ గ్యాస్ లీక్ ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. ఈ ఘటనపై మరికాసేపట్లో ఎన్‌డీఎమ్ఏ(నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ)తో సమావేశం కానున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై కేంద్ర హోంశాఖతో పాటు ఎన్‌డీఏమ్ఏ అధికారులను ఆరా తీసిన ప్రధాని నరేంద్రమోదీ... ప్రమాదం నుంచి ప్రతి ఒక్కరూ సురక్షితంగా బయటపడాలని ఆకాంక్షించారు. ఘటనపై ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు ఫోన్ చేసిన వివరాలు తెలుసుకున్న ప్రధాని నరేంద్రమోదీ... కేంద్రం పూర్తిగా సహకారం అందిస్తుందని తెలిపారు. అయితే గ్యాస్ లీక్ ఘటన కావడంతో వాస్తవ పరిస్థితిపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా ఎన్‌డీఎమ్ఏ అధికారులతో సమావేశం కానున్నట్టు తెలుస్తోంది.

    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Pm modi, Vizag gas leak

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు