హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ... సెప్టెంబర్‌లో ముహూర్తం?... ఛాన్స్ ఎవరికంటే...

కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ... సెప్టెంబర్‌లో ముహూర్తం?... ఛాన్స్ ఎవరికంటే...

కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ... సెప్టెంబర్‌లో ముహూర్తం... ఛాన్స్ ఎవరికంటే...  (File)

కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ... సెప్టెంబర్‌లో ముహూర్తం... ఛాన్స్ ఎవరికంటే... (File)

Cabinet Reshuffle : కేంద్ర ప్రభుత్వం కొందరు మంత్రుల్ని తొలగించి... మరికొందరికి అవకాశం ఇవ్వబోతున్నట్లు తెలిసింది. ముఖ్యంగా యువ నేతలు ఈసారి ఛాన్స్ కొట్టబోతున్నారా?

దేశంలో కరోనా ఎంతకీ కంట్రోల్ కాకపోవడంతో.... దాన్ని అలా ఉంచి... పాలనపై దృష్టి సారిస్తున్న కేంద్ర పెద్దలు... సెప్టెంబర్‌లో కేబినెట్‌ను పునర్వ్యవస్థీకరించబోతున్నట్లు తెలిసింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసిన తర్వాత... ఈ మార్పులూ, చేర్పులూ జరగబోతున్నట్లు సమాచారం. సెప్టెంబర్‌ 17న ప్రధాని మోదీ పుట్టిన రోజు ఉంటుంది. అందువల్ల ఆ నెలపై ప్రత్యేక ఆసక్తి, సెంటిమెంటూ లేనప్పటికీ... పరిస్థితులు... సెప్టెంబర్‌లో విస్తరణ జరిపేందుకు అవకాశాలు కల్పిస్తున్నాయి. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ అనగానే ఎవరిని తొలగిస్తారు, ఎవరికి అవకాశం ఇస్తారన్నది చర్చకు వస్తున్న అంశం. ప్రస్తుతానికి దేశ ఆర్థిక పరిస్థితి బాలేదు. అన్ని మంత్రిత్వ శాఖల పనితీరూ అంతంతమాత్రంగానే ఉంది. ఏమన్నా చేద్దామన్నా... చేసే పరిస్థితి లేదు. ప్రభుత్వ కార్యాలయాలకు సైతం కరోనా సోకుతున్న రోజులివి. అలాగని ఊరుకుంటే... పాలనను వేగవంతం చెయ్యలేమని భావిస్తున్న కేంద్ర పెద్దలు... ఈసారి యువ నేతలకు ఎక్కువ అవకాశం ఇవ్వబోతున్నారని తెలిసింది.

ప్రధానంగా మధ్యప్రదేశ్ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న జ్యోతిరాదిత్య సింథియాకు మంత్రి పదవి దక్కబోతోందని తెలుస్తోంది. మంత్రి పదవిని ఆశించే... ఆయన మార్చి 11న బీజేపీలో చేరారనే వాదన వినిపిస్తోంది. ఆ సంగతి అలా ఉంచితే... తెరవెనక RSS నుంచి ఒత్తిడి వస్తోంది. బెంగళూరు సౌత్‌కి చెందిన బీజేపీ యువ నేత తేజశ్వి సూర్య, రాజ్యసభ ఎంపీ వినయ్ సహస్రబుద్ధె, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కి మంత్రి పదవులు ఇవ్వాలని RSS కోరుతున్నట్లు తెలుస్తోంది. అటు NDA సభ్యులకు కూడా అవకాశం ఇవ్వాలని మోదీ భావిస్తున్నట్లు తెలిసింది. మరి ఎవరికి అవకాశం దక్కుతుందో త్వరలో తెలుస్తుంది.

కరోనా రాకపోయి ఉంటే... ఈపాటికే ఈ పునర్వ్యవస్థీకరణ పూర్తై ఉండేది. కరోనా కారణంగా ఎన్నో వాయిదా పడినట్లే... ఇది వాయిదా పడిందని తెలిసింది. జులై 4న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలవుతాయి. ఆ సమావేశాల్లో పరిణామాలు, ప్రతిపక్షాల తీరు, దేశంలో సమస్యలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని... మంత్రివర్గ విస్తరణ ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికీ ఈ అంశంపై హోంమంత్రి అమిత్ షాతో మోదీ... మూడుసార్లు చర్చించినట్లు సమాచారం. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కూడా మాట్లాడారని తెలిసింది.

ఎవరికి అవకాశం ఇచ్చినా, ఎవర్ని తొలగించినా... ముందు కరోనాను కంట్రోల్ చేస్తే తప్ప... ఏ పనీ జరిగేలా కనిపించట్లేదు. ప్రజలు ఎక్కడికక్కడ పనులు వాయిదా వేసుకుంటున్నారు. వ్యాపారాలు మందగించాయి. దేశం మొత్తం ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో... దాన్ని ఎలా ఆపాలన్నది అసలు సమస్యగా మారింది.

First published:

Tags: Central cabinet, Coronavirus, Covid-19

ఉత్తమ కథలు