PM Narendra Modi Birthday: భారీగా కోవిడ్ వ్యాక్సినేషన్‌.. 20 రోజులు పాటు మోదీ పుట్టినరోజు వేడుకలు.. ఇంకా మరెన్నో కార్యక్రమాలు

ప్రధాని నరేంద్ర మోదీ (File Image)

ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) సెప్టెంబర్ 17న తన 71వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బీజేపీ(BJP) పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.

  • Share this:
    ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) సెప్టెంబర్ 17న తన 71వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బీజేపీ(BJP) పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే 20 రోజుల పాటు పలు కార్యక్రమాలను చేపట్టనున్నారు. నేటితో ప్రారంభం కానున్న ఈ కార్యక్రమాలు.. అక్టోబర్ 7వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఇందులో భాగంగానే పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు, నదీలను శుభ్రం చేసే కార్యక్రమాలు, రేషన్ కార్డుల పంపిణీతో పాటు కరోనా వ్యాక్సినేషన్ లాంటి కార్యక్రమాలను బీజేపీ చేపట్టనుంది. సేవా ఔర్ సమర్పణ్ అభియాన్ ('Seva aur Samarpan Abhiyan) పేరుతో బీజేపీ ఈ కార్యక్రమాలను నిర్వహించనుంది.  ఇందులో భాగంగనే కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను (Covid vaccination) సులభతరం చేసేలా కార్యక్రమాలు చేపట్టాని బీజేపీ నాయకత్వం.. పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది.

    వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను సులభతరం చేయడం.. పుట్టిన రోజున ప్రధాని మోదీకి సరైన బహుమతి అని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా(Mansukh Mandaviya) పేర్కొన్నారు. శుక్రవారం పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. ‘రేపు మన ప్రియతమ ప్రధాని పుట్టినరోజు. ఇప్పటికి వ్యాక్సిన్ వేయించుకోని వారు వ్యాక్సిన్ వేయించుకునేలా.. #VaccineSeva చేద్దాం. ఇది ప్రధాని మోదీకి నిజమైన పుట్టినరోజు కానుక’అని మన్సుఖ్ మాండవీయా గురువారం ట్వీట్ చేశారు.




    Viral Video: ట్రాక్టర్ టైర్ తల మీద నుంచి దూసుకెళ్లింది.. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి..


    ఇక, 2014లో మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బీజేపీ ఆయన పుట్టిన రోజును సేవా దివాస్‌గా జరుపుతోంది. దేశవ్యాప్తంగా సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అయితే గుజరాత్ (Gujarat) ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత ప్రధానిగా మోదీ 20 ఏళ్ల ప్రజాజీవితం పూర్తి చేసుకున్న సందర్బంగా.. ఈ సారి 20 రోజుల పాటు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్దమైంది. ఈ క్రమంలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) .. ఆరోగ్య, రక్తదాన శిబిరాలు నిర్వహించడం, పేదలకు రేషన్ పంపిణీ(Ration Supply) చేయడానికి సంబంధించి పార్టీ కార్యకర్తలకు సూచనలు జారీ చేశారు.

    Gujarat: 24 మందితో గుజరాత్ కొత్త కేబినెట్‌.. పాతవారికి షాక్.. అంతా కొత్తవాళ్లే..

    ఈ క్రమంలోనే 14 కోట్ల రేషన్ బ్యాగ్‌లను (Ration Bags) పంపిణీ చేయాలని భారతీయ జనతా పార్టీ ప్లాన్ చేసింది. వీటిని అవసరమైన వారికి పంపిణీ చేయనున్నారు. ఆ బ్యాగ్‌లపై థ్యాంక్యూ మోదీజీ అని ముద్రించారు. వీటితో పాటు ప్రధాని నరేంద్రమోదీ (PM Narendra Modi) ఫోటోతో కూడిన ఐదు కోట్ల పోస్టుకార్డులను దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ బూత్ కార్యకర్తలు.. వివిధ పోస్టు ఆఫీసులను నుంచి మోదీ పంపించనున్నారు. అంతేకాకుండా.. వారణాసిలోని భారత్ మాతా ఆలయం దగ్గర 71 వేల దీపాలు వెలిగించబోతున్నారు.

    ఇక, మహాత్మా గాంధీ జయంతి(అక్టోబర్ 2) రోజున బిజెపి కార్యకర్తలు పెద్ద ఎత్తున పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఖాదీతో(Khadi) పాటుగా స్థానిక ఉత్పత్తులను( Local Products) ఉపయోగించేలా జనాలలో అవగాహన కల్పించనున్నారు.
    Published by:Sumanth Kanukula
    First published: