'చంపేస్తాం'..మోదీ బయోపిక్ హీరో వివేక్ ఒబెరాయ్‌కి బెదిరింపులు

కొన్ని నెలలుగా వివేక్ బీజేపీకి మద్దతుగా మాట్లాడుతున్నారు. అంతేకాదు వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలో నటించిన పీఎం నరేంద్ర మోదీ చిత్రం శుక్రవారం విడుదలవుతోంది. ఈ క్రమంలో ఆయనకు బెదిరింపు కాల్ రావడం బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.

news18-telugu
Updated: May 22, 2019, 10:12 PM IST
'చంపేస్తాం'..మోదీ బయోపిక్ హీరో వివేక్ ఒబెరాయ్‌కి బెదిరింపులు
వివేక్ ఒబెరాయ్ (ఫైల్)
  • Share this:
బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్‌కి బెదిరింపు కాల్స్ వచ్చాయి. చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఆయనకు ఫోన్‌చేసి వార్నింగ్ ఇచ్చారు. నక్సలైట్స్ పేరు మీద ఆ కాల్స్ వచ్చినట్లుగా ముంబై పోలీసులకు వివేక్ ఒబెరాయ్ ఫిర్యాదు చేశారు. ఆయన విజ్ఞప్తి మేరకు ఆయన నివాసం వద్ద బందోబస్తు పెంచారు పోలీసులు. ఘటనపై కేసు నమోదుచేసుకొని దర్యాప్తుచేస్తున్నారు. కొన్ని నెలలుగా వివేక్ బీజేపీకి మద్దతుగా మాట్లాడుతున్నారు. అంతేకాదు వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలో నటించిన పీఎం నరేంద్ర మోదీ చిత్రం శుక్రవారం విడుదలవుతోంది. ఈ క్రమంలో ఆయనకు బెదిరింపు కాల్ రావడం బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. మోదీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన 'పీఎం నరేంద్ర మోదీ' చిత్రంలో వివేక్ ఒబెరాయ్ లీడ్ రోల్ పోషించారు. ఒమంగ్ కుమార్ ఈ సినిమాను డైరెక్ట్ చేసారు. కౌంటింగ్ తర్వాతి రోజైన మే 24న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను హిందీతో పాటు దేశంలోని 23 భాషల్లో విడుదల చేయనున్నారు. మోదీ టీ అమ్మే స్థాయి నుంచి ప్రధాని స్థాయి వరకు ఎలా ఎదిగారో ఈ చిత్రంలో చూపించనున్నారు.

మరోవైపు రెండు రోజుల క్రితం బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్‌ని కించపరిచేలా ఓ ట్వీట్ చేశారు వివేక్ ఒబెరాయ్. ఐశ్వర్య, సల్మాన్‌లను ఉద్దేశిస్తూ ఒపీనియన్ పోల్ అని, ఐశ్వర్య-వివేక్‌లను ఉద్దేశిస్తూ ఎగ్జిట్ పోల్ అని, ఐశ్వర్య-అభిషేక్ వారి కూతురు ఆరాధ్యలను ఉద్దేశిస్తూ రిజల్ట్ అని రాసి ఉన్న ఫోటోను ఎవరో పోస్ట్ చేయగా దాన్ని వివేక్ ట్వీట్ చేశాడు. దానిపై పెద్ద ఎత్తును దుమారం చెలరేగింది. జాతీయ మహిళా కమిషన్ సైతం నోటీసులు పంపించడంతో.. ఎట్టకేలకు క్షమాపణలు చెప్పాడు వివేక్.

First published: May 22, 2019, 10:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading