హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

PM Modi: ఏషియన్ దేశాలతో భారత్ బంధం వేల ఏళ్ల నాటిది: ఇండియా-ఏషియన్ సదస్సులో ప్రధాని మోదీ

PM Modi: ఏషియన్ దేశాలతో భారత్ బంధం వేల ఏళ్ల నాటిది: ఇండియా-ఏషియన్ సదస్సులో ప్రధాని మోదీ

ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ

ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ గురువారం నాడు 18వ ఏషియన్-ఇండియా సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్ ఎదుర్కొన్న కొన్ని సమస్యలు, సంక్షోభాల గురించి ఆయన ప్రస్తావించారు.

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ గురువారం నాడు 18వ ఏషియన్-ఇండియా సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్ ఎదుర్కొన్న కొన్ని సమస్యలు, సంక్షోభాల గురించి ఆయన ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2022తో మన భాగస్వామ్యం 30 ఏళ్లు పూర్తి చేసుకుంటుందని చెప్పారు. అప్పటికి భారత్‌‌కు స్వాతంత్ర్యం లభించి 75 ఏళ్లు పూర్తవుతుందని.. ఈ సందర్భంగా భారత్ ఈ మైలురాయిని చేరుకోనున్న నేపథ్యంలో 2022ను ‘ఏషియన్-ఇండియా ఫ్రెండ్‌షిప్ ఇయర్’గా భారత్ జరుపుకుంటుందని చెప్పడానికి హర్షం వ్యక్తం చేశారు.

భారత్ ఇటీవల ఎదుర్కొన్న ప్రధాన సంక్షోభాల్లో ప్రధానమైన కోవిడ్-19 మహమ్మారి గురించి ప్రధాని మోదీ ప్రస్తావిస్తూ.. కోవిడ్-19 వల్ల మనందరం ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నామని, ఈ సంక్షోభ సమయం ఇండియా-ఏషియన్ స్నేహానికి కూడా ఒక పరీక్ష వంటిదని ఆయన చెప్పారు.

ఇది కూడా చదవండి: Pegasus Spyware : అప్పుడు మ‌మ్మ‌ళ్ని అడ్డుకొన్నారు.. కానీ ఇప్పుడు.. : "సుప్రీం" ఉత్త‌ర్వుల‌పై రాహూల్‌గాంధీ హ‌ర్షం

కోవిడ్ సంక్షోభ సమయంలో ఇండియా-ఏషియన్ పరస్పర సహకారం భవిష్యత్‌లో స్నేహపూర్వక సంబంధాలను మరింత బలపరుస్తుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏషియన్ దేశాలతో భారత్ బంధం వేల ఏళ్ల నాటిదని, ఈ సత్సంబంధాలు మన విలువలు, ఆచారాలు, భాషలు, సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లను ప్రతిబింబిస్తున్నాయని ఆయన చెప్పారు. గతేడాది కూడా వర్చువల్‌గా 17వ ఏషియన్-ఇండియా సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సంవత్సరం కూడా వర్చువల్‌గానే మోదీ ఈ సదస్సులో భాగం పంచుకున్నారు.

First published:

Tags: India news, Modi, National News, Pm modi

ఉత్తమ కథలు