హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

PM Modi - Farm Reforms Act: వ్యవసాయ చట్టాలు రాత్రికి రాత్రి తేలేదు, MSPపై రైతులకు ప్రధాని మోదీ భరోసా

PM Modi - Farm Reforms Act: వ్యవసాయ చట్టాలు రాత్రికి రాత్రి తేలేదు, MSPపై రైతులకు ప్రధాని మోదీ భరోసా

ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ

వ్యవసాయ సంస్కరణల చట్టాలను రాత్రికి రాత్రి తీసుకురాలేదని, సుమారు 20, 22 సంవత్సరాల నుంచి రాజకీయ పార్టీలు, రైతులు కోరుతున్నదాన్నే తాము తీసుకొచ్చానమి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

వ్యవసాయ సంస్కరణల చట్టాలను రాత్రికి రాత్రి తీసుకురాలేదని, సుమారు 20, 22 సంవత్సరాల నుంచి రాజకీయ పార్టీలు, రైతులు కోరుతున్నదాన్నే తాము తీసుకొచ్చానమి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మధ్యప్రదేశ్‌ రైతులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ‘వ్యవసాయ సంస్కరణలపై ప్రతిపక్షాలు అబ్ధాలు ప్రచార ంచేస్తున్నాయి. నిపుణులు కూడా కొత్త చట్టాలు తీసుకురావాలని చెప్పారు. రైతుల కోసం స్వామినాధన్ కమిటీ ఇచ్చిన సిఫారసులను గత ప్రభుత్వాలు పక్కన పెట్టారు. ప్రతిపక్ష పార్టీ కూడా వ్యవసాయ చట్టాలు తెస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది. కానీ, మేం తీసుకొచ్చిన చట్టాలను వ్యతిరేకిస్తోంది.’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రైతులను ప్రతిపక్షాలు మోసం చేస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు. ‘రైతులను ఇంకెన్నాళ్లు మోసం చేస్తారు. మీకు రైతులే దొరికారా?’ అని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్న ప్రధాని మోదీ కనీస మద్దతు ధరపై హామీ ఇచ్చారు.

‘వారి ( రాజకీయ పార్టీలు) సమస్య ఏంటో అడుగుతున్నాం. కానీ, వారు మాతో మాట్లాడడానికి సిద్ధంగా లేరు. ప్రజాక్షేత్రంలో పట్టు కోల్పోయిన పార్టీలు రైతుల్లో ఆందోళనలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. రైతుల పొలాలు పోతాయని భయపెడుతున్నారు. ఈ రోజు రాజకీయ పార్టీల బండారం బయట పడింది. స్వామినాధన్ కమిషన్ సిఫారసులను అమలు చేయకుండా ఎనిమిదేళ్ల పాటు వారు పక్కన పెట్టారు.’ అని ప్రధాని మోదీ విమర్శించారు.

ఇప్పుడు రైతుల పేరుతో ఉద్యమం చేస్తున్న వారు అప్పుడు వారు అధికారంలో ఉన్నప్పుడు, లేదా అధికారంలో భాగస్వాములై ఉన్నప్పుడు రైతులకు మేలు ఎందుకు చేయలేదని ప్రధాని మోదీ ప్రశ్నించారు. ఈ విషయాన్ని దేశం గుర్తుంచుకోవాలన్నారు. ఈ రోజు ప్రతిపక్షాల తీరును దేశ ప్రజల ముందు, రైతులు ముందు పెట్టాలని కిసాన్ కళ్యాణ్ కార్యక్రమంలో ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. రైతులకు మద్దతు ధరపై ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. తాము MSP తీసేయాలనుకుంటే, తాము స్వామినాధన్ కమిషన్ సిఫారసులను ఎందుకు అమలు చేస్తామని ప్రశ్నించారు. ‘మా ప్రభుత్వం కనీస మద్దతు ధరపై సీరియస్‌గా ఉంది. అందుకే, మేం ప్రతి ఏటా కనీస మద్దతు ధరలను ప్రకటిస్తున్నాం. ఇది ప్రతి రైతుకు స్పష్టంగా తెలుస్తుంది.’ అని ప్రధాని మోదీ అన్నారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ సంస్కరణల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్, హర్యానా, యూపీ, మధ్యప్రదేశ్, గుజరాత్ సహా పలు రాష్ట్రాలకు చెందిన వేలాది మంది రైతులు ఢిల్లీని ముట్టడించారు. 23 రోజులుగా వారు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు చేస్తున్నారు. మూడు చట్టాలను రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే, రద్దు సాధ్యం కాదంటూ కొన్ని సవరణలను కేంద్ర ప్రభుత్వం సూచించింది. కానీ, ఆ ప్రతిపాదనలను రైతులు తిరస్కరించారు. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది. రైతుల ధర్నాను తాము గుర్తిస్తున్నామన్న సుప్రీంకోర్టు, వ్యవసాయ సంస్కరణల చట్టాలను కొన్నాళ్లు నిలిపిఉంచే అవకాశాలను పరిశీలించాలని కేంద్రానికి ధర్మాసనం సూచించింది. సమస్యను పరిష్కరించుకోవడానికి ఓ ప్యానెల్ ఏర్పాటు చేయాలని సూచించింది.

First published:

Tags: Farmers Protest, New Agriculture Acts, Pm modi

ఉత్తమ కథలు