PM Modi on Petrol Diesel Price: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించాలని కోరుతున్నానని అన్నారు. తాను ఎవరినీ తప్పు బట్టడం లేదని .. ప్రజలపై భారం తగ్గించాలనే విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు ప్రధాని మోదీ.
మనదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు (Petrol Diesel Price) మండిపోతున్నాయి. తెలంగాణలో పెట్రోల్ రూ.120, డీజిల్ 105కి చేరింది. కొన్ని రాష్ట్రాల్లో ఇంకా ఎక్కువే ఉంది. పెరిగిపోతున్న ఇంధన ధరలను తగ్గించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పెట్రోల్ డీజిల్ ధరలపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ (Excise Duty)ని తగ్గించిందని..కానీ రాష్ట్రాలు మాత్రం వ్యాట్‌ను తగ్గించడం లేదని అన్నారు. రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించకపోవడం వల్లే ప్రజలపై భారం పడుతోందని పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించాలని కోరుతున్నానని అన్నారు. తాను ఎవరినీ తప్పు బట్టడం లేదని .. ప్రజలపై భారం తగ్గించాలనే విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు ప్రధాని మోదీ. దేశంలో కరోనా పరిస్థితిపై రాష్ట్రాలతో నిర్వహించిన రివ్యూ మీటింగ్లో ఈ వ్యాఖ్యలు చేశారు.
Centre reduced the excise duty on fuel prices last November and also requested states to reduce tax. I am not criticizing anyone but request Maharashtra, West Bengal, Telangana, Andhra Pradesh, Kerala, Jharkhand, TN to reduce VAT now and give benefits to people: PM Modi pic.twitter.com/NlAAPQ3EZj
ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.119.49, డీజిల్ ధర 105.49 వద్ద స్థిరంగా ఉంది. విశాఖపట్టణంలో లీటర్ రూ.120.81, డీజిల్ రేటు 106.40గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.105.41, డీజిల్ రేటు 96.67 వద్ద స్థిరంగా ఉన్నాయి. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.120.51, డీజిల్ 104.77కి అందుబాటులో ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ 110.95, డీజిల్ రూ.101.04కి లభిస్తోంది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రేటు రూ.115.12, డీజిల్ ధర రూ.99.83 వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి.
భారత్‌లో మార్చి 22 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. 14 సార్లు ధరలుపెరగడంతో లీటర్ పెట్రోల్‌పై మొత్తంగా రూ.10 మేర ఎగబాకింది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరగడంతో.. ధరలను పెంచారు. ఐతే ఏప్రిల్ 7 నుంచి మాత్రం ఉపశమనం లభించింది. ఇంధన పెరుగుదలకు బ్రేకులు పడ్డాయి. అప్పటి నుంచీ.. 21 రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు నిత్యం మారుతుంటాయి. కొత్త రేట్లు ఉదయం 6 గంటల నుంచి వర్తిస్తాయి. కానీ పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, వ్యాట్ వంటి పన్నులు తోడవడంతో.. దాని ధర అసలు ధర కంటే రెట్టింపు అవుతుంది. ట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగడానికి కారణం ఇదే . ఐతే 21 రోజులుగా ధరలు పెరగకపోవడంతో సామాన్య ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు.
మీ నగరంలో పెట్రోల్, డీజిల్ ధరలను ప్రతిరోజూ SMS ద్వారా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ (IOC) వినియోగదారులు RSP<డీలర్ కోడ్‌ని 9224992249 నంబర్‌కు ఎస్ఎంఎస్ చేయాలి. HPCL కస్టమర్‌లు HPPRICE <డీలర్ కోడ్>ని 9222201122కి, BPCL వినియోగదారులు RSP<డీలర్ కోడ్>ని 9223112222కి SMS చేయాలి.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.