PM Narendra Modi: అమెరికాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం.. పూర్తి షెడ్యూల్ ఇదే

వాషింగ్టన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ

PM Narendra Modi US tour: ప్రధాని మోదీ బయల్దేరిన విమానం అప్ఘనిస్తాన్ గగన తలం మీదుగా కాకుండా పాకిస్తాన్ గగనతలం మీదుగా ప్రయాణించింది. తాలిబన్ల దురాక్రమణతో అప్ఘనిస్తాన్‌లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పాకిస్తాన్ మీదుగా వెళ్లారు.

 • Share this:
  భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) అమెరికా (America) చేరుకున్నారు. వాషింగ్టన్‌లో ఆయనకు ఇండియన్-అమెరికన్లు ఘన స్వాగతం పలికారు. ఐదు రోజుల పాటు ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటిస్తున్నారు. అమెరికాతో పాటు జపాన్, ఆ్రస్టేలియాలతో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడమే ఈ పర్యటన ఉద్దేశమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. కోవిడ్‌ సంక్షోభం, ఉగ్రవాదం నిర్మూలన, వాతావరణం మార్పులు, ఇతర అంశాలపై యూఎన్‌ సదస్సులో దృష్టి పెడతామని ఆయన వెల్లడించారు. ప్రధాని మోదీ బుధవారం ఎయిర్‌ ఇండియా వన్‌ విమానంలో అమెరికాకు బయలుదేరిన విషయం తెలిసిందే. జాతీయ భద్రత సలహాదారుడు అజిత్‌ దోవల్, విదేశీ వ్యవహారాల కార్యదర్శి హర్షవర్ధన్‌ శ్రింగ్లా సహా పలువురు ఉన్నతాధికారులు ఆయన వెంట వెళ్లారు.  COVID-19: గుడ్ న్యూస్.. దేశంలో తగ్గిన ఆర్ వాల్యూ.. ప్రస్తుతం ఎంత ఉందంటే..

  అమెరికా బయలుదేరే ముందు తన పర్యటన గురించి వివరాలను వెల్లడించారు ప్రధాని నరేంద్ర మోదీ. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) ఆహ్వానం మేరకే అక్కడికి వెళుతున్నానని.. ఇండియా, అమెరికా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి బైడెన్‌తో చర్చిస్తానని చెప్పారు. '' సెప్టెంబరు 22–25 వరకు అమెరికా పర్యటన కొనసాగుతుంది. ఈ పర్యటనలో జో బైడెన్‌తో ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా ఇరు దేశాల ప్రయోజనాలను కాపాడే అంశాలపై చర్చించి అభిప్రాయాలను పంచుకుంటాం. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌, జపాన్‌ ప్రధాని యొషిహిదె సుగాలతో కలిసి తొలిసారి ప్రత్యక్షంగా జరగనున్న క్వాడ్‌ సదస్సులోనూ పాల్గొంటాను. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో భవిష్యత్‌ కార్యాచరణ, ప్రాధాన్యాలను గుర్తించడానికి  సదస్సు దోహదపడుతుంది.''  అని  ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.

  Karnataka : గెల‌వ‌డానికి మోదీ వేవ్ ఒక్క‌టే స‌రిపోదు : క‌ర్ణాట‌క మాజీ సీఎం

  అమెరికాలో నరేంద్ర మోదీ  షెడ్యూల్:

  సెపె్టంబర్‌ 23న అమెరికాలోని వాషింగ్టన్‌లో మేజర్‌ కంపెనీల సీఈవోలతో సమావేశమవుతారు. క్వాల్‌కామ్, అడోబ్, ఫస్ట్‌ సోలార్, ఆటమిక్స్, బ్లాక్‌స్టోన్‌ కంపెనీల సీఈవోలతో చర్చిస్తారు. అనంతరం ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌తో ముఖాముఖి చర్చలు జరుపుతారు.

  సెప్టెంబర్‌ 24న  అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో వైట్‌హౌస్‌లో చర్చలు జరుపుతారు. అప్ఘానిస్తాన్‌ పరిణామాలు,  ఉగ్రవాదం, చైనా ఆధిపత్యం, భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం వంటి అంశాలపై చర్చిస్తారు.  ఆ తర్వాత అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌తోనూ భేటీ అవుతారు ప్రధాని మోదీ.

  అదే రోజు జపాన్‌ ప్రధాని యోషిహిడో సుగాతో విడిగా సమావేశమవుతారు. అనంతరం అమెరికా, భారత్, ఆ్రస్టేలియా, జపాన్‌ దేశాలతో కూడి న క్వాడ్‌ సదస్సులో పాల్గొంటారు. ఆ సమావేశం ముగిసిన తర్వాత ప్రధాని మోదీ న్యూయార్క్‌ బయల్దేరి వెళతారు.

  సెప్టెంబరు 25న ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారు ప్రధాని నరేంద్ర మోదీ. అదే రోజు భారత్‌కు తిరుగు ప్రయాణమవుతారు.    సెప్టెంబర్‌ 26న  భారత కాలమానం ప్రకారం ఉదయం 11.30 గంటలకు న్యూఢిల్లీకి చేరుకుంటారు.

  Punjab Politics: గేమ్ ఆఫ్ థ్రోన్స్‌ను తలపించిన పంజాబ్ రాజకీయం..

  పాక్ మీదుగా అమెరికాకు పయనం:

  ప్రధాని మోదీ బయల్దేరిన విమానం అప్ఘనిస్తాన్ గగన తలం మీదుగా కాకుండా పాకిస్తాన్ గగనతలం మీదుగా ప్రయాణించింది. తాలిబన్ల దురాక్రమణతో అప్ఘనిస్తాన్‌లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పాకిస్తాన్ మీదుగా వెళ్లారు. అందుకు పాక్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రధాని, రాష్ట్రపతి విదేశాలకు వెళితే తమ గగనతలం మీదుగా వెళ్లడానికి పాకిస్తాన్ నిరాకరిస్తూ వచ్చిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ తీరుపై  భారత్‌ ఇంటర్నేషనల్‌ సివిల్‌ ఏవియేషన్‌ ఆర్గనైజేషన్‌లో తన నిరసన గళాన్ని వినిపించింది. ఇక ప్రస్తుతం అప్ఘానిస్తాన్ గగనతలం సురక్షితం కాదు కాబట్టి ప్రధాని మోదీ విమానానికి ఈసారి పాకిస్తాన్ అనుమతి ఇచ్చింది.
  Published by:Shiva Kumar Addula
  First published: