Home /News /national /

PM MODI YOUTUBE CHANNEL SUBSCRIBERS NOW OVER 1 CRORE HIGHEST AMONG GLOBAL LEADERS PVN

PM Modi Record : తగ్గేదే లే..యూట్యూబ్ లో మోదీ వరల్డ్ రికార్డు

ప్రధాని మోదీ(ఫైల్ ఫొటో)

ప్రధాని మోదీ(ఫైల్ ఫొటో)

Modi Record In Social Media : మోదీకి మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. చాలా మంది సామాన్యుల నుంచి ప్రముఖల వరకు ఆయనను అభిమానిస్తారు,సోషల్ మీడియాలో ఫాలో అవుతుంటారు. ప్రపంచంలోనే అత్యధిక పాపులారిటీ ఉన్న నేతగానూ మోదీ ఉన్నారు. ఇదే క్రమంలో వీడియో ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ లోనూ ప్రధాని మోదీ చానెల్ తాజాగా రికార్డు సృష్టించింది.

ఇంకా చదవండి ...
Modi YouTube Subscribers : ప్ర‌ధాని మోదీ మ‌రో ఘ‌న‌త‌ను అందుకున్నారు. మోదీ సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే. అయితే ఆయన ఇప్పుడు తగ్గేదే లేదంటూ సెలబ్రిటీలతో పోటీ పడుతూ మరీ సోషల్ మీడియాలో దూసుకెళ్తున్నారు. మోదీకి మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. చాలా మంది సామాన్యుల నుంచి ప్రముఖల వరకు ఆయనను అభిమానిస్తారు,సోషల్ మీడియాలో ఫాలో అవుతుంటారు. ప్రపంచంలోనే అత్యధిక పాపులారిటీ ఉన్న నేతగానూ మోదీ ఉన్నారు. ఇదే క్రమంలో వీడియో ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ లోనూ ప్రధాని మోదీ చానెల్ తాజాగా రికార్డు సృష్టించింది. ప్ర‌పంచంలో ఇప్పటివరకు ఏ దేశాధినేతకు క్కని రికార్డు సృష్టించింది. మంగ‌ళ‌వారం నాటికి ‘నరేంద్ర మోదీ’ పేరుతో ఉన్న ప్రధాని అధికారిక యూట్యూబ్ చానల్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య కోటి దాటింది. ఈ విషయాన్ని ప్రసార భారతి న్యూస్ సర్వీసెస్ ట్విట్టర్ లో ప్రకటించింది. దీంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ఆగ్ర నాయ‌కుల యూట్యూబ్ ఛానెళ్ల సబ్‌స్క్రైబర్ల సంఖ్య‌ను గ‌మనిస్తే మోదీనే టాప్‌లో ఉన్నారు.

ప్రధాని మోదీ తర్వాతి స్థానంలో 36 లక్షల యూట్యూబ్ సబ్‌స్క్రైబర్లతో బ్రెజిల్ అధ్య‌క్షుడు జైర్ బోల్సోనారో ఉండగా,ఆ త‌ర్వాత మెక్సికో అధినేత ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడోర్ 30.7 లక్షల మంది యూట్యూబ్ సబ్‌స్క్రైబర్లతో మూడో స్థానంలో నిలిచారు. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో 28.8 లక్షలు యూట్యూబ్ సబ్‌స్క్రైబర్లతో నాలుగో స్థానం నిలవగా, అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ 7.3 ల‌క్ష‌ల మంది యూట్యూబ్ స‌బ్‌స్క్రైబ‌ర్ల‌ను క‌లిగి ఉన్నారు. వైట్ హౌస్‌ యూట్యూబ్ ఛానెల్ కు 19 ల‌క్ష‌ల మంది స‌బ్‌స్క్రైబ‌ర్లు ఉన్నారు. యూట్యూబ్ సబ్‌స్క్రైబర్ల పరంగా చూస్తే ప్రస్తుతం ఏ దేశాధినేత కూడా మోదీ చానెల్‌కు దరిదాపుల్లో లేరు.

ALSO READ Budget 2022 - E passport: అన్ని రాష్ట్రాల్లో ఈ పాస్ పోర్ట్ విధానం.. నిర్మలా సీతారామన్

2007 అక్టోబరులో గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు నరేంద్రమోదీ పేరిట యూట్యూబ్ ఛానల్ సృష్టించబడింది. మోడీకి సంబంధించిన చాలా అంశాల వీడియోలు ఈ ఛానెల్ లో ఉన్నాయి. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఛానెల్ తో పాటు యూట్యూబ్‌లో భార‌త ప్రధానమంత్రి అధికారిక PMO ఇండియా ఛానెల్ కూడా ఉంది. దీనికి 1.69 మిలియ‌న్ల సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. దీని ద్వారా దేశానికి వివిధ అధికారిక ప్రకటనలు, ప్ర‌ధాని ప్రసంగాలు అందించ‌బ‌డుతున్నాయి.

ఇక భారత దేశంలోని రాజకీయ నేతల యూట్యూబ్ చానెళ్ల సబ్‌స్క్రైబర్ల జాబితాలోనూ ప్రధాని మోదీ అగ్రస్థానంలో ఉన్నారు. మోదీ తర్వాత యూట్యూబ్ లో ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్లను కలిగిన దేశీ నేతలను పరిశీలిస్తే.. రాహుల్ గాంధీకి 5.25 లక్షల మంది, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కు 4.39 లక్షల మంది,ఎమ్ఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి 3.73 లక్షల మంది, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కు 2.12 లక్షల మంది,ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు 1.37 లక్షల మంది చొప్పున యూట్యూబ్ చానళ్ల పై సబ్‌స్క్రైబర్లను కలిగి ఉన్నారు.

ALSO READ Union Budget 2022: వార్షిక బడ్జెట్‌లో అసలేముంది? ఈసారి కొత్తగా ఏం రాబోతున్నాయి?

ఇక, యూట్యూబ్ తో పాటు ఇత‌ర సోష‌ల్ మీడియా దిగ్గ‌జ ప్లాట్‌ ఫామ్ ల‌లోనూ ప్ర‌ధాని మోడీ పాలోవ‌ర్లు అధికంగానే ఉన్నారు. ట్విట్టర్ లో మోదీకి 753 లక్షల మంది ఫాలోవర్లు ఉండ‌గా, ఫేస్‌బుక్ లో 468 లక్షల మంది మోడీని ఫాలో అవుతున్నారు.

మరోవైపు,ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా కూడా మోదీదే రికార్డు ఉంది. అత్యంత ప్రజామోదం ఉన్న దేశాధినేతల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ అగ్ర స్థానంలో ఉన్నట్లు అమెరికాకు చెందిన డేటా ఇంటెలిజెన్స్ కంపెనీ మోర్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ ఇటీవల నిర్వహించిన సర్వేలో తేలింది. అమెరికా మాత్రమే కాదు ఎంతో అభివృద్ధి చెందిన దేశాల అధినేతలు కూడా మోదీ తర్వాతి స్థానాల్లోనే నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మోర్నింగ్ కన్సల్ట్ (Morning Consult)అనే సంస్థ సర్వే నిర్వహించింది. ఎవరికి ఎక్కువ పాపులారిటీ ఉందో ప్రజలను అడిగి తెలుసుకుంది. ఇందులో భాగంగా మన దేశంలోనూ సర్వే చేయగా.. నరేంద్ర మోదీకి సానుకూలంగా 71 శాతం మంది, వ్యతిరేకంగా 21 శాతం మంది స్పందించారు.

మొత్తం 13 దేశాల అధినేతలపై మార్నింగ్ కన్సల్ట్ సంస్థ ప్రజల అభిప్రాయాలను సేకరించింది. జనాల్లో ఆ నాయకులకు ఉన్న పాపులారిటీ తెలుసుకునే ప్రయత్నం చేసింది. అప్రూవల్ రేటింగ్స్‌ను ట్రాక్ చేసి.. ఎవరికి అత్యధిక ప్రజాదరణ ఉందో వెల్లడించింది. భారత్‌తో పాటు అమెరికా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇటలీ, జపాన్, మెక్సికో, దక్షిణ కొరియా, స్పెయిన్, బ్రిటన్ దేశాధినేతల అప్రూవల్ రేటింగ్స్‌ను తెలుసుకుంది మార్నింగ్ కన్సల్ట్. ఈ సర్వేలో నరేంద్ర మోదీ 71 శాతం రేటింగ్‌తో మొదటి స్థానంలో నిలిచారు. మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ఒబ్రేడర్ 66 శాతంతో రెండో స్థానంలో ఉన్నారు. ఇటలీ ప్రధాని మారియో డ్రాగి 60శాతం ప్రజామోదంతో మూడో స్థానంలో నిలిచారు. ఇక అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆరో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఈ 13 దేశాల జాబితాలో బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌ చిట్టచివరి స్థానంలో ఉన్నారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Narendra modi, Youtube channel

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు