నేడే మోదీ, జిన్‌పింగ్ భేటీ.. సర్వాంగ సుందరంగా ముస్తాబైన మహాబలిపురం..

Modi Xi Meet: భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ నేడు తమిళనాడులోని మహాబలిపురంలో భేటీ కానున్నారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: October 11, 2019, 6:40 AM IST
నేడే మోదీ, జిన్‌పింగ్ భేటీ.. సర్వాంగ సుందరంగా ముస్తాబైన మహాబలిపురం..
జిన్‌పింగ్ రాక సందర్భంగా చెన్నైలో చైనా, భారత్ జెండాలతో విద్యార్థులు
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: October 11, 2019, 6:40 AM IST
వారిద్దరు ప్రపంచంలోనే శక్తిమంతమైన లీడర్లు.. ఇద్దరూ ఆసియాకు చెందిన వారే.. పైగా, ప్రపంచపటంలో తమ దేశాలను టాప్ పొజిషన్‌లో ఉంచాలని కోరుకునే వ్యక్తులు.. అలాంటి వారిద్దరు కలిస్తే.... ప్రపంచమే ఇటు చూస్తుంది. వీరిద్దరు ఏం చేస్తారు? దేని గురించి చర్చిస్తారు? అని చెవులు రిక్కించి వింటాయి. ఆ ఇద్దరు లీడర్లు ఎవరో కాదు.. భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్. వారిద్దరు నేడు తమిళనాడులోని మహాబలిపురంలో భేటీ కానున్నారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య పచ్చ గడ్డి వేసినా భగ్గు మనేలా కోపం ఉంది. డోక్లాం వివాదం ఇరు దేశాల మధ్య యుద్ధానికి దారి తీసే దాకా వెళ్లింది. అదీకాక.. మన దాయాది పాకిస్తాన్‌కు డ్రాగన్ దేశం ఎల్లప్పుడు అండగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో మోదీ, జిన్‌పింగ్ భేటీ కానుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. వీరిద్దరు రెండు దేశాల మధ్య అంశాలు, వాణిజ్య విషయాలు, అంతర్జాతీయ అంశాలపై చర్చించుకుంటారనీ, ఏ ఒప్పందాలూ కుదుర్చుకునేది లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

అయితే, జమ్మూ కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నందున, ఆ దేశానికి చైనా ఎక్కువగా మద్దతు ఇవ్వకుండా అడ్డుకునేందుకు, మన వైపు తిప్పుకునేందుకె ఈ భేటీ ఉపయోగపడుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో 2018 ఏప్రిల్ 27, 28లో ప్రధాని మోదీ చైనా వెళ్లి వుహన్‌లో జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు. అప్పుడే మళ్లీ కలుద్దామని మోదీ అన్నట్లు తెలిసింది. ఆ క్రమంలో మరోసారి వీరిద్దరి భేటీ జరగబోతోంది.

ఇదిలా ఉండగా, మోదీ, జిన్‌పింగ్ భేటీ కోసం మహాబలిపురం సర్వాంగసుందరంగా ముస్తాబైంది. రెండు దేశాల జెండాలు, ధగధగమెరిసే కాంతులతో వెలుగుతోంది. మరోవైపు, పోలీసులు పూర్తి స్థాయి భద్రతను ఏర్పాటు చేశారు. ఆంక్షలు విధించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు. నేడు, రేపు భారత్‌లో ఉండనున్న జిన్‌పింగ్.. సముద్రం పక్కన ఉన్న ఆలయాన్ని సందర్శిస్తారు. ఆయన రాక సందర్భంగా ఆలయాన్ని సరికొత్తగా ముస్తాబు చేశారు.

First published: October 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...