హోమ్ /వార్తలు /జాతీయం /

Welcome Home Abhinandan.. ప్రధాని మోదీ సహా నేతల ట్వీట్ల వర్షం...

Welcome Home Abhinandan.. ప్రధాని మోదీ సహా నేతల ట్వీట్ల వర్షం...

అభినందన్ వర్థమాన్

అభినందన్ వర్థమాన్

‘వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌కు స్వాగతం. నీ ధైర్యసాహసాలను చూసి దేశం గర్విస్తోంది.’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

సుమారు మూడున్నర గంటల ఉత్కంఠ తర్వాత భారత పైలెట్ అభినందన్ వర్థమాన్ భారత్‌లో అడుగుపెట్టాడు. అట్టారి బోర్డర్‌లో బీఎస్ఎఫ్ జవాన్లు అతడిని రిసీవ్ చేసుకున్నారు. వింగ్ కమాండర్‌కు వెల్కం హోం అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ‘వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌కు స్వాగతం. నీ ధైర్యసాహసాలను చూసి దేశం గర్విస్తోంది. మన సైన్యం 130 కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తినిస్తున్నాయి’ అని ట్వీట్ చేశారు. చివర్లో జైహింద్ అంటూ ముగించారు.

ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్

రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర హోశాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ అభినందన్ వర్థమాన్‌కు స్వాగతం పలుకుతూ ట్వీట్లు చేశారు.

వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను చూసి దేశం గర్విస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. ఇదే స్ఫూర్తితో దేశ సేవలో మరింతకాలం కొనసాగాలని ఆకాంక్షించారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా అభినందన్ వర్థమాన్‌ను పొగడ్తల్లో ముంచెత్తుతూ ట్వీట్ చేశారు.

First published:

Tags: Abhinandan Varthaman, Amit Shah, Pm modi, Pulwama Terror Attack, Rahul Gandhi

ఉత్తమ కథలు