ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో గురువారం సమావేశమయ్యారు. తొలిసారి వ్యక్తిగతంగా సమావేశం కావడంతో ఇరువురు నేతలు హర్షం వ్యక్తం చేశారు. జూన్ 2021లో తమ టెలిఫోన్ సంభాషణను గుర్తు చేసుకున్నారు. అఫ్ఘనిస్తాన్‌తో పాటు ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాల గురించి చర్చించారు. స్వేచ్ఛ, స్నేహం, సమ్మిళిత ఇండో-పసిఫిక్ ప్రాంతం పట్ల తమ నిబద్ధతను మళ్ళీ తెలియజేశారు. ఇరు దేశాల్లోని కోవిడ్-19 పరిస్థితిపై కూడా అగ్రనేతలు చర్చించారు. ప్రస్తుతం మహమ్మారిని అరికట్టడానికి కొనసాగుతున్న టీకా ప్రయత్నాలు గురించి మాట్లాడారు. కరోనా ఔషధాలు, ఆరోగ్య సంరక్షణ పరికరాల సరఫరాతో కరోనాను అరికట్టవచ్చనే అంశంపై చర్చించారు. ఔషధాల సరఫరాకు భరోసా ఇచ్చిపుచ్చుకున్నారు.
వాతావరణ మార్పుపై ఇరు దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అంగీకరించారు. రెన్యువబుల్ ఎనర్జీ వాడకాన్ని పెంచడానికి భారతదేశం కృషి చేస్తోందని మోదీ కమలా హారిస్‌కు తెలియజేశారు. ఇటీవల ప్రారంభించిన జాతీయ హైడ్రోజన్ మిషన్ గురించి ప్రధాని మాట్లాడారు. పర్యావరణ సుస్థిరతను ప్రోత్సహించడానికి జీవనశైలి మార్పులు దోహదం చేస్తాయని మోదీ వివరించారు.
అసెంబ్లీలో సీరియస్ ఇష్యూపై మాట్లాడుతుండగా జారిన సిద్దరామయ్య
అంతరిక్ష రంగంలో సహకారం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అభివృద్ధి చెందుతున్న వర్ధమాన సాంకేతికతలు, ఆరోగ్య సంరక్షణ రంగంలో సహకారం వంటి భవిష్యత్తు సహకార రంగాల గురించి కమలా హరీస్, ప్రధాని మోదీ చర్చించారు. పరస్పర ప్రయోజనకరమైన విద్యా సంబంధాల గురించి కూడా సమాలోచనలు చేశారు. రెండు దేశాల నాలెడ్జ్, ఇన్నోవేషన్, టాలెంట్ చేంజ్ అవుతుందని గుర్తించారు.
మోడల్‌కు తప్పుడు హెయిర్ కట్.. సెలూన్ సిబ్బందికి గట్టి షాక్.. NCDRC తీర్పు
‘ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిలో మీరు స్పూర్తి నింపారు. బైడెన్, మీ నాయకత్వంలో మన ద్వైపాక్షిక సంబంధాలు కొత్త శిఖరాలను తాకుతాయని నాకు పూర్తిగా నమ్మకం ఉంది’ అని మోదీ హారిస్‌తో చెప్పారు. ఈ సమావేశంలో దేశ ప్రజల తరఫున ప్రధాని మోదీ.. కమలా హారిస్, సెకండ్ జెంటిల్మెన్ డగ్లస్ ఎమ్‌హాఫ్‌ను భారత పర్యటనకు ఆహ్వానించారు.
Covid ex gratia: కరోనా మృతుల కుటుంబాలకు రూ.50వేలు..ఎలా పొందాలో తెలుసుకోండి
ఈ సమావేశంలో కమలా హారిస్.. ఉగ్రవాద కార్యకలాపాలలో పాకిస్తాన్ పాత్ర గురించి ప్రస్తావించారు. ఉగ్రవాద గ్రూపులకు మద్దతు ఇవ్వడం ఆపాలని భారత ప్రధాని నరేంద్ర మోదీని కోరారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేడు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో తొలిసారిగా ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. మూడు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా శ్వేతసౌధంలో అధ్యక్షుడు జో బైడెన్‌తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. బైడెన్ జనవరి 20న అధ్యక్షుడిగా పదవీబాధ్యతలు స్వీకరించిన తర్వాత మోదీతో వ్యక్తిగతంగా సమావేశం కావడం ఇదే తొలిసారి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: America, Kamala Harris, Narendra modi, PM Narendra Modi, USA