Home /News /national /

PM MODI URGES PEOPLE TO HOIST TRICOLOUR AT HOME BETWEEN AUGUST 13 AND 15 PVN

PM Modi : ఆ తేదీల్లో ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలి

భారత ప్రధాని నరేంద్ర మోదీ(ఫైల్ ఫొటో)

భారత ప్రధాని నరేంద్ర మోదీ(ఫైల్ ఫొటో)

PM Modi : 75 ఏళ్ల స్వాతంత్య్రాన్ని( పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దేశవ్యాప్తంగా "ఆజాదీ కా అమృత్ మహోత్సవ్(Azadi Ka Amrit Mahotsav)"పేరిట కార్యక్రమాలను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది 76వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్రం మరో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

ఇంకా చదవండి ...
PM Modi : 75 ఏళ్ల స్వాతంత్య్రాన్ని( పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దేశవ్యాప్తంగా "ఆజాదీ కా అమృత్ మహోత్సవ్(Azadi Ka Amrit Mahotsav)"పేరిట కార్యక్రమాలను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది 76వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్రం మరో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కేంద్రం చేపట్టిన ఈ ప్రత్యేక కార్యక్రమానికి "హర్ ఘర్ తిరంగా(Har Ghar Tiranga movement)" అని పేరు పెట్టారు.

ఇందులో భాగంగా ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయడం లేదా ప్రదర్శించడం చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా హర్​ ఘర్​ తిరంగా ఉద్యమం మరింత బలోపేతమవుతుందని అన్నారు. ఈ ప్రచారం త్రివర్ణ పతాకం(Tricolor)తో మనకున్న అనుబంధాన్ని మరింతగా పెంచుతుందని ప్రధాని మోదీ(PM Modi) ట్వీట్ ద్వారా కోరారు. 1947 జులై 22న త్రివర్ణ పతాకాన్ని ఆమోదించిన సందర్భంగా మోదీ వరుస ట్వీట్లు చేశారు. వలస పాలనలో స్వేచ్ఛా భారతం, త్రివర్ణ పతాక రెపరెపల కోసం పోరాడిన వారి ధైర్యాన్ని, కృషిని ఈ సందర్భంగా ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. వారి ఆశయాలను నెరవేర్చేందుకు,వారి కలల భారతదేశాన్ని నిర్మిం,డానికి తాము కట్టుబడి ఉన్నామని ఓ ట్వీట్ లో ప్రధాని తెలిపారు. త్రివర్ణ పతాకాన్ని జాతీయ జెండాగా స్వీకరించడానికి దారి తీసిన అధికారిక సమాచార వివరాలను సైతం మోదీ ‌ట్విట్టర్‌లో షేర్​ చేశారు.



Amith Shah : రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది విజయం యావత్ దేశానికే గర్వకారణం

"ఈరోజు, జూలై 22కి మన చరిత్రలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. 1947లో ఇదే రోజున మన జాతీయ జెండాను ఆమోదించారు. మన త్రివర్ణ పతాకం,పండిట్ నెహ్రూ ఆవిష్కరించిన మొదటి త్రివర్ణ పతాకంతో అనుబంధించబడిన కమిటీ వివరాలతో సహా చరిత్ర నుండి కొన్ని ఆసక్తికరమైన విషయాలు" అంటూ కొన్ని డాక్యుమెంట్ లను మోదీ ట్విట్టర్ లో షేర్ చేశారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Azadi Ka Amrit Mahotsav, National flag, Pm modi

తదుపరి వార్తలు